ముస్లిం వివాహాలు, విడాకుల చట్టాన్ని రద్దు చేసేందుకు అస్సాం ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇక, అస్సాం ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలో విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
Assam: అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం అతిపెద్ద చర్చకు దారి తీసింది. ఇది రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుకు ముందడుగుగా పరిగణించబడుతోంది.