Maharashtra: ఈ ప్రపంచంలో అన్నింటి కంటే పెద్ద జీవి తిమింగలం. ఇది దాదాపు 97 అడుగుల పొడవుతో 199 టన్నుల బరువు ఉంటుంది. ఇక అప్పుడే పుట్టిన తిమింగలం పిల్ల దాదాపు 2 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. సాధారణంగా తిమింగలాలు వాటి భారీ కాయం కారణంగా సముద్రంలో చాల లోతులో ఉంటాయి. అయితే అనుకోకుండా ఒక్కోసారి అవి తీరానికి వచ్చి చిక్కుకు పోతుంటాయి. ఇలాంటి ఘటనే తాజాగా మహారాష్ట్ర లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లా గణపతిపులే తీరంలో ఓ తిమింగలం పిల్ల ఒడ్డుకు చేరి ఇసుకలో కూరుకుపోయింది. దాని బరువు దాదాపు 4 టన్నులు ఉంది. దీనితో అది ఎటు కదలలేక అక్కడే కొట్టుమిట్టాడుతూ ఉండగా.. స్థానికు గమనించారు. అనంతరం స్థానికులు, పర్యాటకులు కలిసి దానిని సముద్రం లోకి పంపేందుకు సాయశక్తులా ప్రయత్నించారు.
Read also:Delhi Air Pollution: ఢిల్లీలో కనిపించని రోడ్లు.. నానా అవస్థలు పడుతున్న జనం
కానీ బారి శరీరంతో 4 టన్నుల బరువుతో ఇసుకలో కూరుకుపోయి ఉన్న ఆ తిమింగలం పిల్లను బయటకు లాగేందుకు చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యాయి. దీనితో దాన్ని ఒక బెల్టుకు కట్టి లాగే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నంలో ఆ ప్రాణికి గాయాలయ్యాయి. దీంతో ఆ గాయాలను నయం చేసేందుకు వైద్యుల్ని రప్పించారు. ఈ క్రమంలో పోలీసులు, తీరగస్తీ దళం కూడా రంగంలో దిగాల్సి వచ్చింది. కాగా సోమవారం ఉదయం నుంచి ప్రయత్నాలు మొదలైతే బుధవారం తెల్లవారుజామున అంటే దాదాపు 40 గంటలు ప్రయత్నించి చివరికి ఓ పడవ సాయంతో ఆ ప్రాణిని సముద్రం లోపలకు 7-8 నాటికల్ మైళ్ల దూరం లాక్కొని వెళ్లి వదిలారు.