Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: యాక్సిడెంట్లు, రాళ్ల దాడులతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వార్తల్లో నిలుస్తోంది. భారత రైల్వే, మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలుపై ఇటీవల కాలంలో వరసగా దాడులు జరుగుతున్నాయి. కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా సమీపంలో శనివారం అర్థరాత్రి రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. రైలు హౌరా నుంచి న్యూ జల్‌పైగురి వెళ్తోంది.
Read Also: Womens nude photos scam : పూజల పేరుతో మహిళల నగ్నచిత్రాలు తీసిన గ్యాంగ్.. పరారీలో నిందితుడు
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
ఈ ఘటనలో రైలు బోగీ కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయని తూర్పు రైల్వే ఓ ప్రకటనలో తేలిపింది. దీనిపై విచారణ జరుపుతున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల వరసగా దాడులు జరుగుతున్నాయి. జనవరి నెలలో డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సీదేవా ప్రాంతానికి సమీపంలో రెండు కోచ్‌లపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తెలిపింది. ఆ తరువాత మాల్దా సమీపంలోని హౌరా నుండి న్యూ జల్‌పైగురికి వెళ్తున్న రైలుపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. జనవరి నెలలో ఇది రెండో దాడి. తాజాగా మరోసారి ముర్షిదాబాద్ లో మరోసారి దాడికి గురైంది.
వరస దాడులు:
ఫిబ్రవరిలో సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గుండా వెళుతుండగా దుండగులు రాళ్లతో దాడి చేశారు. జనవరిలో విశాఖపట్నం కంచరపాలెం వద్ద మద్యం మత్తులో దుండగులు రాళ్లదాడి చేయడంతో అదే మార్గంలో వెళ్లే రైలు దెబ్బతింది. ఫిబ్రవరి 23న, కొందరు దుండగులు రైలుపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ మైసూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ అద్దాలు పగిలాయి. బీహార్‌లోని కతిహార్ మీదుగా రైలు వెళుతుండగా రైలుపై దాడి జరిగింది.
#WATCH | West Bengal: Stones pelted at Vande Bharat Express near Farakka last evening; visuals from Howrah station
This is a very unfortunate incident. It will be investigated. An inquiry has been ordered to investigate it: Kausik Mitra, CPRO, Eastern Railway pic.twitter.com/vUofDaTOgh
— ANI (@ANI) March 11, 2023
తాజావార్తలు
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్‌ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!