Vande Bharat Express: యాక్సిడెంట్లు, రాళ్ల దాడులతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వార్తల్లో నిలుస్తోంది. భారత రైల్వే, మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలుపై ఇటీవల కాలంలో వరసగా దాడులు జరుగుతున్నాయి. కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా సమీపంలో శనివారం అర్థరాత్రి రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు.