AIADMK Internal Rift: స్టాలిన్‌తో ఈపీఎస్ ఫొటో.. అన్నాడీఎంకేలో రాజకీయ దుమారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIADMK Internal Rift: తమిళనాడు రాజకీయాల్లో ఓ ఫొటో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌తో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫొటో రాజకీయంగా కలకలం రేపుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ల వివాహ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ వేడుకలో స్టాలిన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ పక్కన పళనిస్వామి కూర్చొని మాట్లాడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తు కుదిరే అవకాశాలున్నాయా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ ఫొటోపై అన్నాడీఎంకే సీనియర్ నేత నాథం విశ్వనాథన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ వ్యవస్థాపక సూత్రాలకు పళనిస్వామి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
Also Read
- Uttar Pradesh: పొరపాటున ఒవైసీకి గౌరవ వందనం.. సీవోపై బదిలీ వేటు..!
- Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
- PM Modi: నేపాల్‌కు భారీ సాయం.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ..
- Bihar MLA Anant Singh: బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. 50 లక్షల గులాబ్ జామూన్లు, విజేతకు థార్ కారు!
నవంబర్ 23న దిండిగల్‌లో మీడియాతో మాట్లాడిన నాథం విశ్వనాథన్.. స్టాలిన్‌తో పళనిస్వామి కలిసి కూర్చోవడం, పలకరించుకోవడం, ఆ ఫొటోను బహిరంగంగా ప్రచారం చేయడంపై అభ్యంతరం తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులను మర్యాదపూర్వకంగా పలకరించడంలో తప్పు లేదని, అయితే అలాంటి సాన్నిహిత్యాన్ని బహిరంగంగా ప్రచారం చేయడం వల్ల పార్టీ కార్యకర్తలు, ఓటర్లలో గందరగోళం ఏర్పడుతుందని అన్నారు.
డీఎంకేతో సాన్నిహిత్యం ప్రదర్శించడం అన్నాడీఎంకే సిద్ధాంతాలకు విరుద్ధమని విశ్వనాథన్ అన్నారు. “అన్నాడీఎంకేను స్థాపించిన ఎంజీఆర్ ఎలాంటి సిద్ధాంతాలతో పార్టీని ఏర్పాటు చేశారు? జయలలిత పార్టీని ఎలా నడిపించారు? అనే విషయాలను ప్రస్తుత నాయకత్వం గుర్తు చేసుకోవాలి. డీఎంకేతో అనుబంధం లేదు, సంబంధం లేదు అనేదే అన్నాడీఎంకే ప్రాథమిక సిద్ధాంతం” అని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకే మద్దతుతో ముఖ్యమంత్రి కావడానికి పళనిస్వామి ప్రయత్నించారని కూడా ఆయన ఆరోపించారు. ప్రస్తుతం స్టాలిన్‌తో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ మర్యాదలో భాగంగా ఒకరినొకరు పలకరించుకోవడం తప్పు కాదని, అయితే డీఎంకే-అన్నాడీఎంకే మధ్య రహస్య సంబంధాలు, పొత్తు చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం ఉన్న సమయంలో ఇలాంటి ఫొటోలను బహిరంగంగా ప్రచారం చేయడం సరికాదని విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు.
పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్థాపించిన రాజకీయ సిద్ధాంతాలను ప్రస్తుత నాయకత్వం గౌరవించాలని విశ్వనాథన్ సూచించారు. ఈ సందర్భంగా జయలలితను ప్రస్తావిస్తూ.. “జయలలిత బతికుంటే ఇలాంటి చర్యలను ఎప్పటికీ అంగీకరించేవారు కాదు. పార్టీ ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తి ప్రధాన కార్యదర్శిగా కొనసాగాలా? లేదా? అనే విషయాన్ని పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలతో అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇప్పటికే డీఎంకే-అన్నాడీఎంకే మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వివాదం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ల వివాహ వేడుకలో రాజకీయ, సినీ ప్రముఖులు ఒకే వేదికపైకి రావడం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే స్టాలిన్, పళనిస్వామి కలిసి కనిపించిన ఫొటోపై అన్నాడీఎంకే నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం రాజకీయ వివాదంగా మారింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
AIADMK Internal Rift: స్టాలిన్‌తో ఈపీఎస్ ఫొటో.. అన్నాడీఎంకేలో రాజకీయ దుమారం!
-
12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
-
Shubman Gill: శుభ్‌మన్ గిల్ నువ్ ఓ కెప్టెన్.. మైదానంలోనే అలా చేయడం సరికాదు!
-
Uttar Pradesh: పొరపాటున ఒవైసీకి గౌరవ వందనం.. సీవోపై బదిలీ వేటు..!
-
NVIDIA CEO Jensen Huang: ఈసారి మంచి సీఈఓగా ఉంటా.. కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.. భావోద్వేగానికి గురైన జెన్సన్ హువాంగ్!
ట్రెండింగ్
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!