టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ కు భారీ ఊరట లభించింది. పూరి, తరుణ్ నమునాల్లో డ్రగ్స్ లేవని ఎఫ్ఎస్ఎల్ తేల్చేసింది. పూరి, తరుణ్ రక్తం, వెంట్రుకలు, గోళ్లును రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ పరీక్షించారు. 2017 జులైలో పూరి, తరుణ్ నుంచి నమూనాలను ఎక్సైజ్ శాఖ సేకరించిన విషయం తెలిసిందే. స్వచందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్ పేర్కొంది. గతేడాది డిసెంబరు 8న ఎక్సైజ్ కు ఎఫ్ఎస్ఎల్ నివేదికలు…