Shashi Tharoor: ‘‘భారతీయుడిగా మాట్లాడా’’.. కాంగ్రెస్ ‘‘లక్షణరేఖ’’ వ్యాఖ్యలపై శశిథరూర్..
- భారతీయుడిగా స్పందించా..
- ఆపరేషన్ సిందూర్ పై పొగడ్తల్ని తప్పుపడుతున్న కాంగ్రెస్..
- కాంగ్రెస్ ‘‘లక్ష్మణ రేఖ’’ వ్యాఖ్యలపై స్పందించిన శశిథరూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు హస్తం పార్టీకి రుచించడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం థరూర్ ‘‘లక్ష్మణ రేఖ’’ దాటారని భావిస్తున్నారు. అయితే, దీనిపై శశి థరూర్ స్పందించారు. ‘‘భారతీయుడిగా గర్వించదగిన పౌరుడిగా ఈ వ్యాఖ్యలు చేశాను’’ అని స్పష్టం చేశారు. వ్యక్తిగత హోదాలో తన అభిప్రాయాలను చెప్పానని, అవి పార్టీ వైఖరిన ప్రతిబింబించవని, తాను పార్టీ అధికార ప్రతినిధిని కాదని ఆయన గురువారం చెప్పారు.
Read Also: Operation Sindoor: పాకిస్తాన్‌కి అండగా నిలిచిన చైనా, టర్కీ.. సంచలన విషయాలు వెలుగులోకి..
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
‘‘ఈ విషయాలలో కొన్నింటిపై నాకు జ్ఞానం ఉందని ప్రజలు భావిస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి వారు వచ్చి నా అభిప్రాయాలను అడుగుతారు. నేను చాలా స్పష్టంగా, కొన్నిసార్లు స్పష్టంగా మరియు కొన్నిసార్లు పరోక్షంగా, ఒక భారతీయుడిగా, గర్వించదగిన పౌరుడిగా నా వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నానని చెబుతున్నాను. మీరు దానితో ఏకీభవించవచ్చు. విభేదించవచ్చు. నన్ను నిందించవచ్చు.’’ అని అన్నారు.
తాను తన పరిమితుల్ని దాటినట్లు కొంతమంది కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని అడిగినప్పుడు, ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయో నాకు తెలియదని థరూర్ అన్నారు. కేంద్రం ప్రభుత్వం పాకిస్తాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ని ప్రశంసించడం కాంగ్రెస్ పార్టీకి రుచించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శశిథరూర్‌ని పార్టీలోని ఓ వర్గం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ట్రంప్ ఒత్తిడితో భారత్ సైనిక చర్యని ఆపేసిందని నిందిస్తున్న సమయంలో, ట్రంప్ చేసిన వాదనల్ని థరూర్ ఖండించారు.
#WATCH | Thiruvanathapuram | "…At this time, at a time of conflict, I spoke as an Indian. I never pretended to speak for anyone else. I am not a spokesperson for the party. I am not the government spokesperson. Whatever I have said, you may agree or disagree with that, blame it… pic.twitter.com/7xNAU93IyQ
— ANI (@ANI) May 15, 2025
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్‌గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!