Monsoon: అన్నదాతలకు శుభవార్త.. 24 గంటల్లో కేరళను ముద్దాడనున్న తొలకరి వాన

  • అన్నదాతలకు శుభవార్త
  • 24 గంటల్లో కేరళను ముద్దాడనున్న తొలకరి వాన
  • వారం.. 10 రోజుల్లో దేశమంతటా విస్తరణ
  • ఊపందుకోనున్న ఖరీఫ్ సీజన్
Monsoon

Monsoon

అన్నదాతలు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు మరికొన్ని గంటల్లో కేరళను తాకబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే 24 గంటల్లో తొలకరి వర్షం కేరళ తీరాన్ని తాకబోతున్నాయని ఐఎండీ తెలిపింది. గురువారం కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ‘‘తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు.. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు.. లక్షద్వీప్ దీవులకు.. నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు.. ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.’’ అని భారత వాతావరణ శాఖ తెలిపింది.

రుతుపవనాలు కేరళ గుండా ప్రయాణం చేస్తూ మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీకి చేరుకుంటాయని తెలిపింది. అనంతరం దేశ మంతటా విస్తరించనున్నాయి. ఖరీఫ్ సీజన్ సమీపిస్తోంది. దీంతో రుతుపవనాలు ఎప్పుడొస్తాయని కర్షకులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. నారుమళ్లు వేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వర్షాలు కురిస్తే పంటలు వేగం పుంజుకుంటాయి. అందరికీ పనులు దొరుకుతాయి. కూలీలకు చేతి నిండా డబ్బులు ఉంటాయి.

×
×
Ad

ఇక వారం రోజుల్లో రుతుపవనాలు ముంబైకి చేరుకోనున్నాయి. ప్రస్తుతం కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవనున్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాబోయే మూడు నాలుగు రోజుల్లో ముఖ్యంగా కొంకణ్, గోవా ప్రాంతంలో వర్షాలు పెరిగే అవకాశం ఉంది.

ఈసారి ఆలస్యం..


వాస్తవానికి ఈపాటికే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాలి. కానీ ఈ ఏడాది ఆలస్యమయ్యాయి. గతేడాది మే నెల మధ్యలోనే రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు, నదులు నిండుకున్నాయి. పాడి పంటలు సమృద్ధిగా పండాయి. మొత్తానికి ఆలస్యమైనా గురువారం కేరళను రుతుపవనాలు తాకనుండడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

ముంచుకొస్తున్న ఎల్‌నినో


ఇదిలా ఉంటే మరోవైపు ఎల్‌నినో ముంచుకొస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లో వర్షాలు తక్కువై ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఈ ప్రభావం భారత్‌పై కూడా ఎక్కువగా ఉంటుంది. వర్షాలు తక్కువై ఆర్థిక పరిస్థితులు కూడా దిగజారిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.