సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగు చూసిన తర్వాత ఆ దేశం నుంచి ఎవ్వరు వచ్చినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.. తాజాగా, సౌతాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన మరో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. బెంగళూరుకు వచ్చిన ఇద్దరికి, చండీగఢ్‌కు వచ్చిన ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు వెల్లడించారు.. అయితే, అది ఒమిక్రాన్ వేరియంటా అనే టెన్షన్ నెలకొనగా.. బెంగళూరుకు వచ్చిన వారిలో ఒకరిలో డెల్టా, మరొకరిలో డెల్టా ప్లస్‌కు భిన్నమైన వేరియంట్‌గా నిర్ధారించారు.. చండీగఢ్‌కు చెందిన ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా తేల్చారు.. అతడి కుటుంబంలోని మరో ఇద్దరికి కూడా పాజిటివ్‌గా తేలింది. ఇక, వీరి నుంచి సేకరించిన నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం ఢిల్లీ ఎన్సీడీసీకి పంపించారు. కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తున్న సమయంలో.. విదేశాల నుంచి వచ్చే ప్రతీ ప్రయాణికుడిని నిశితంగా పరిశీలిస్తున్నారు.. ముఖ్యంగా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూసిన దేశాల నుంచి వచ్చేవారికి అయితే, టీకా వేసుకున్నా, కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్నా.. మళ్లీ టెస్టులు చేసిన తర్వాతే దేశంలోకి అనుమతి ఇస్తున్నారు.