సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం నిర్వహించారు. అధికార బిజేపి ని దీటుగా ఎదుర్కుని నిలువరించేందుకు, భావసారూప్యతగల పార్టీ లన్నింటినీ ఏకం చేసి, మరింత బలీయమైన ఉమ్మడి పోరుకు సన్నధ్దమౌతున్నారు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాలలో మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసిన ఉమ్మడి పోరు ను మరింత సమర్ధవంతంగా కొనసాగించేందుకు, ప్రతిపక్షాల ఐక్యతను పటిష్టంచేసేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యపక్షం
గా ఉండి అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కే. స్టాలిన్ ( డి.ఎమ్.కె), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్దవ్ థాకరే (శివసేన), ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ( జార్ఖండ్ ముక్తి మోర్చా) తో పాటుగా శివసేన, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పాల్గొంది.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
- Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
అయితే ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలను సోనియా గాంధీ ఆహ్వనించగా ఆప్, ఎస్.పి, బి.ఎస్.పి హాజరుకాలేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇటీవల అసమ్మతి గళాన్ని వినిపించిన కపిల్ సిబల్ గత వారం ఏర్పాటు చేసిన “డిన్నర్ సమావేశం” తర్వాత, ఈ రోజు సోనియా గాంధీ నిర్వహిస్తున్న ప్రతిపక్షాల సమావేశానికి అత్యంత ప్రధాన్యత ఇచ్చారు. కపిల్ సిబల్ “డిన్నర్ సమావేశం” కు సమాజవాది పార్టీ, అకాలీదళ్ తో సహా మొత్తం 15 ప్రతిపక్ష పార్టీ లకు చెందిన 45 మంది నేతలు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రకిపక్షాల ఉమ్మడి పోరు, ఐక్యత బలంగా కోరుకుంటున్నప్పటికీ, గాంధీ కుటుంబ నాయకత్వం పట్ల వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నేతలు.
అయుతే, ప్రతిపక్షాల ఐక్యత కోసం, ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసిన రాహుల్ గాంధీ… పార్లమెంట్ సమావేశాల సందర్భంగా, ఉదయం ప్రతిపక్షాల నేతలతో అల్పాహార సమావేశాన్ని స్వయంగా నిర్వహించడంతో పాటు, ప్రతిపక్షాల సమావేశాలలో పలుమార్లు పాల్గొన్నారు రాహుల్ గాంధీ. పలు నిరసన ప్రదర్శనలో కూడా చురుగ్గా పాల్గొన్నారు రాహుల్ గాంధీ. రైతుల ఆందోళనకు మద్దతుగా ట్రాక్టర్ పై, పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ పై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరై, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే, ప్రతిపక్షాల ఐక్యత పటిష్టంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు పలు ప్రతిపక్షాలు.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!