Delhi Building Collapse: “రక్షించండి”.. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
- ఢిల్లీలో విషాదం..
- కుప్పకూలిన హాస్టల్ భవనం..
- శిథిలాల కింద 30-50 మంది విద్యార్థులు.?
- రక్షించాలని ఫోన్ కాల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Building Collapse: ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఆదివారం 5 అంతస్తులు భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 30 నుంచి 50 మంది విద్యార్థులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. భవనంలో పీజీ హాస్టల్ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సండే కావడంతో విద్యార్థుల్లో చాలా మంది భవనంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున రెస్క్యూ చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 10 మందిని రెస్క్యూ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. బిల్డింగ్ కుప్పకూలిన ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారికి వైద్య సహాయాన్ని ఆదేశించారు. మరోవైపు, రాహుల్ గాంధీ ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఘటనా స్థలంలో సహాయక చర్యల్ని సమీక్షించారు.
ఇదిలా ఉంటే, శిథిలాల కింద చిక్కుకుపోయిన విద్యార్థులు తమను రక్షించాలని కేకలు వేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొందరు విద్యార్థులు కాపాడాలని ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే అనిల్ శర్మ చెప్పారు. భవనం కూలడానికి ముందు బేస్మెంట్లో మరమ్మతు పనులు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. హాస్టల్ డేస్‌గా పిలిచే ఈ హాస్టల్లో ఢిల్లీ యూనివర్సిటీకి సౌత్ క్యాంపస్‌కు దగ్గరగా ఉండటంతో చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. కూలిన భవనం 20ఏళ్ల పాతదని స్థానికులు చెబుతున్నారు. సత్య నికేతన్ ప్రాంతంలో అనేక పాత ఇళ్లను హాస్టల్స్‌గా మార్చి విద్యార్థులకు అద్దెకు ఇస్తున్నట్లు తెలిపారు.
Also Read
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- RSS: ఆర్ఎస్ఎస్, హిజ్బుల్ ముజాహిదీన్ ఒకటే.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
#WATCH | Delhi | Satya Niketan PG building collapse | Rescue operation ongoing. NDRF and Fire Department teams at work at the collapse site. pic.twitter.com/I64JVdaCVb
— ANI (@ANI) September 6, 2026
తాజావార్తలు
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!