CWC Meeting: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) గురువారం భేటీ కాబోతోంది. రేపు సాయంత్రం 5.30 నిమిషాలకు సోనియా అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రేపు జరగబోయే సీడబ్ల్యూసీ మీటింగ్ లో అధిక ధరలకు వ్యతిరేకంగా ఆగస్టు 28న ఢిల్లీలో రాంలీలా మైదానంలో నిర్వహించబోతోన్న ర్యాలీ గురించి కూడా చర్చించనున్నారు.
Congress interim president Sonia Gandhi tests positive for COVID19: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇటీవలే పోస్ట్ కోవిడ్ సమస్యలతో చికిత్స తీసుకున్నారు సోనియాగాంధీ. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతకుముందు జూన్ మొదటివారంలో కరోనా బారిన పడ్డారు సోనియా గాంధీ.
అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం.. మళ్లీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.. గతంలో పార్టీకి దూరమైనవారు కూడా తిరిగి టీఎంసీ గూటికి చేరుతున్నారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుస్మితా దేవ్.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సుత్మితా దేవ్.. టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్ సమక్షంలో టీఎంసీ కండువా…