Karnataka: కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. 16 లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
- కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం
- 16 లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
- అసెంబ్లీలో ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
- బ్యాన్ విధించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వినియోగం, సోషల్ మీడియా వ్యసనం, ఆన్లైన్ భద్రతా సమస్యల నేపథ్యంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని శుక్రవారం 2026–27 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ సిద్ధరామయ్య ప్రకటించారు. పిల్లలపై అధిక స్క్రీన్ టైమ్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Israel-Khamenei: ఖమేనీ హత్య వెనుక ఇంత జరిగిందా? వెలుగులోకి సంచలన రిపోర్ట్
Also Read
- Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
దేశంలో పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్ వేసిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలు కూడా ఆలోచన చేస్తున్నాయి. ఇంతలోనే కర్ణాటక నిర్ణయం తీసుకుని ప్రకటించేసింది. సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ అవసరమనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఆస్ట్రేలియా ఇప్పటికే చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠిన నియమాలు అమలు చేస్తోంది. బ్రిటన్, ఫిన్లాండ్ వంటి దేశాలు కూడా ఇలాంటి చర్యలను పరిశీలిస్తున్నాయి. అలాగే ఫ్రాన్స్, స్పెయిన్ వంటి యూరప్ దేశాల్లో పాఠశాలల్లో మొబైల్ ఫోన్ వినియోగంపై పరిమితులు విధించి విద్యార్థుల దృష్టి, చదువుపై ప్రభావం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే అంశం కొంతకాలంగా కర్ణాటక ప్రభుత్వంలో చర్చలో ఉంది. రాష్ట్ర ఐటీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అసెంబ్లీలో మాట్లాడుతూ.. యువతలో సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని బాధ్యతగా ఉంచే చర్యలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇక ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు కూడా మాట్లాడుతూ.. పిల్లల్లో అధిక స్క్రీన్ టైమ్ వల్ల కలిగే సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ స్పందిస్తూ. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరిఎస్గా తీసుకోవాలని సూచించారు.
నిపుణుల అంచనా..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం యువతలో అధిక స్మార్ట్‌ఫోన్ వినియోగం వల్ల నిద్రలేమి, ఆందోళన, చదువుపై దృష్టి తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. పిల్లలు సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత సమాచారాన్ని తెలియకుండా పంచుకోవడం వల్ల గోప్యత సమస్యలు, సైబర్ నేరాలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ గ్రేమింగ్ వంటి ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. అయితే సోషల్ మీడియా పూర్తిగా ప్రతికూలం కాదని.. చాలా మంది విద్యార్థులకు ఇది విద్యా వనరులు, కోడింగ్ కమ్యూనిటీలు, సృజనాత్మక అవకాశాలు, వ్యాపార అవకాశాలను కూడా అందిస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే నిపుణులు పూర్తి నిషేధం కంటే వయస్సు పరిమితులు, పేరెంటల్ కంట్రోల్స్, డిజిటల్ అవగాహన కార్యక్రమాలు వంటి మధ్యంతర మార్గాలను అనుసరించడం మంచిదని సూచిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నియంత్రణపై మరింత చర్చకు దారి తీసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!
తాజావార్తలు
-
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
-
KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
-
Suriya : ఆ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా సూర్య 50?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!