Dhanush: మరోసారి త్యాగం చేయనున్న ధనుష్?.. రజనీకాంత్ ‘జైలర్ 2’ కోసం ‘ఓం’ వాయిదా పడుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: కోలీవుడ్‌లో వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోల్లో ధనుష్ ముందువరుసలో ఉంటారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తన లైనప్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా కొత్త ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తూ ముందుకు సాగుతుంటారు. అయితే గత కొంతకాలంగా ఆయన గురించి తమిళ సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు అవకాశం ఇవ్వడం కోసం తన సినిమాల విడుదల తేదీలను మార్చుకుంటూ వస్తున్నందుకు ధనుష్‌ను కొందరు సరదాగా ‘శాక్రిఫైస్ స్టార్’ అని కూడా పిలుస్తున్నారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశముందనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం’ అక్టోబర్ 16న విడుదల చేయాలని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ను అక్టోబర్ 15న దసరా కానుకగా విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో పరిస్థితి మారిపోయింది. ఒక రోజు వ్యవధిలో ఈ రెండు భారీ తమిళ సినిమాలు విడుదల కావడం సాధ్యమేనా అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో మొదలైంది.
Also Read
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
ఈ ఊహాగానాలకు కారణం ధనుష్ గతంలో తీసుకున్న నిర్ణయాలే. కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్ 2’ విడుదల సందర్భంగా తన ‘రాయన్’ సినిమాను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అలాగే అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విడుదల నేపథ్యంలో తన ‘ఇడ్లీ కడాయి’ చిత్రాన్ని కూడా వాయిదా వేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ రెండు సందర్భాల్లోనూ పెద్ద స్టార్ హీరోలతో నేరుగా పోటీ పడకుండా ధనుష్ వెనక్కి తగ్గినట్లు పరిశ్రమలో చర్చ జరిగింది.
ఇప్పుడు కూడా అదే తరహాలో ‘జైలర్ 2’ కోసం ‘ఓం’ విడుదల తేదీ మారే అవకాశం ఉందని తమిళ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ధనుష్ గానీ, చిత్రబృందం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇది ప్రస్తుతం కేవలం ప్రచారంగానే మిగిలింది. మరోవైపు ‘జైలర్’ ఘన విజయంతో ‘జైలర్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దసరా సీజన్‌ను లక్ష్యంగా పెట్టుకుని ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్న నేపథ్యంలో, ఇతర చిత్రాలు తమ విడుదల తేదీలను మార్చుకునే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. అయితే చివరికి ధనుష్ మరోసారి తన సినిమాను వాయిదా వేసి “శాక్రిఫైస్ స్టార్” అనే పేరును కొనసాగిస్తారా? లేక ఈసారి రజనీకాంత్ సినిమాతోనే బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతారా? అనే విషయంపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..