CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
- SIR వివాదంపై CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు ముగిసిన CJP గడువు..
- ఎన్నికల్ని బహిష్కరించాలని ప్రతిపక్ష పార్టీలకు సీజేపీ పిలుపు..
- బంగ్లాదేశ్‌లో ఇలాగే ఎన్నికల్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు 10 నెలల్లో 14 సందర్భాల్లో ఎస్ఐఆర్, పేర్ల తొలగింపు, ఓటర్ల డేటా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన విషయాల్లో అభ్యంతరం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. దీంతో ప్రతిపక్షాలు CEC జ్ఞానేష్ కుమార్‌ను టార్గెట్ చేశాయి. ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కూడా CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని 48 గంటల డెడ్‌లైన్ విధించింది. అక్టోబర్ 02 నుంచి దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమిస్తామని అల్టిమేటం జారీ చేసింది. ముంబై నుంచి తమ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని కేంద్రాన్ని హెచ్చరించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, కో కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి సీఈసీ రాజీనామాతో పాటు రాబోయే ఎన్నికల్ని ఫ్రీజ్ చేయాలని, సర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Also Read
- INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
- Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
- DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
అభిజిత్ దీప్కే ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని, ఇది తెలిసినా ప్రతిపక్షాలు ఎందుకు పోటీ చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇదే కాకుండా వరసగా పోటీ చేస్తూ ప్రతిపక్షాలు ఆ ఎన్నికలకు చట్టబద్ధత కల్పిస్తున్నాయని అన్నారు. రిగ్గింగ్ ఎన్నికల్ని బాయ్‌కాట్ చేయాలని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బంగ్లాదేశ్‌లో ప్రతిపక్షాల బాయ్‌కాట్..
షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ 2014లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ప్రస్తుతం ఆ దేశంలో అధికారంలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) నేతృత్వంలోని 18 పార్టీల ప్రతిపక్ష కూటమి 2013 డిసెంబర్ నుంచి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. 2024 ఎన్నికలను కూడా బీఎన్పీ మరోసారి బహిష్కరించింది.
2024 ఎన్నికలో షేక్ హసీనా మరోసారి ఘన విజయం సాధించిన తర్వాత, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ యువత ఉద్యమించారు. షేక్ హసీనా భారత్ పారిపోయి వచ్చేలా హింసాత్మక ఉద్యమం ప్రేరేపించింది. షేక్ హసీనా తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ ప్రభుత్వం ఏర్పాటైంది.
సీజేపీ పిలుపుపై భిన్న స్వరాలు:
ఇప్పుడు సీజేపీ ఎన్నికలను ప్రతిపక్షాలు బహిష్కరించాలని కోరుతోంది. దీనిని చూస్తే బంగ్లాదేశ్‌లో ప్రతిపక్షాలు ఎలా ఎన్నికల్ని బాయ్‌కాట్ చేశాయో, అలాగే భారత్‌లో కూడా ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయొద్దని పిలుపునిచ్చారు. నిజానికి ఎన్నికల కమిషన్ మీద ఆధారాలు లేని ఆరోపణలతో ఇలాంటి డిమాండ్ చేయడం ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదు. ముఖ్యంగా, సీజేపీ బీజేపీ గెలుపును ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు గెలిచిన రాష్ట్రాల ఎన్నికల్ని ప్రశ్నించకపోవడం గమనార్హం.
క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈసీదే..
మరోవైపు వరసగా వస్తున్న విమర్శలు, ఫామ్-6పై అనుమానాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. ఇన్ని విమర్శలు వస్తున్న ఈసీ నుంచి పెద్దగా ప్రకటన రాలేదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదిక తర్వాత పలు విషయాలపై ఎన్నికల అంతర్గత చర్చల్లో విభేదాలు, భిన్నాభిప్రాయాలు రావడం సహజమే అని, చివరకు అంతా ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకున్నాకే అమలు అవుతాయని చెబుతోంది.
తాజావార్తలు
-
CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
-
INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
-
In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
-
22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?