SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
- ప్రతిపక్షాల కోసం కాదు, ప్రజల సందేహాలు తీర్చాలి..
- ఎన్నికల సంఘాన్ని కోరిన బీజేపీ మిత్రపక్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIR Row: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ఎన్నికల సంఘంలో అంతర్గత భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే నివేదికల నేపథ్యంలో, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక విన్నపం చేశాయి. ఈ ఆరోపణలపై స్పందించి, ప్రజల సందేహాలు తొలగించాలని కోరాయి. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా(ఆర్ఎల్ఎం) నేత ఉపేంద్ర కుష్వాహా, తెలుగుదేశం నేతలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో సందేహాలను నివృత్తి చేయాలని అన్నారు.
పాట్నాలో మాట్లాడిన ఎల్జేపీ(రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్, ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ సంస్థ కాబట్టి తాము దానిని ప్రభుత్వం తరుఫున సమర్థించాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం సహజమే అని, అయితే విమర్శలకు సమాధానం ఇవ్వడం కోసం కాకుండా ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ఈసీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు పెరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పాశ్వాన్ అఅన్నారు. రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వా్ల్సిన అవసరం లేదని, ఓటర్లలో సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని అన్నారు.
Also Read
- Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
- CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
- Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
ఆర్ఎల్ఎం నేత ఉపేంద్ర కుష్వాహా మాట్లాడుతూ.. ప్రజల్లో ఎస్ఐఆర్పై గందరగోళం ఏర్పడిందని, ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని అన్నారు. టీడీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐఆర్ పారదర్శకంగా నిర్వహించారని అన్నారు. ఇదే సమయంలో పశ్నలు తలెత్తితే, వివరణ ఇస్తే ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
దీనికి ముందు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం దేశంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు 10 నెలల్లో 14 సందర్భాల్లో ఎస్ఐఆర్, పేర్ల తొలగింపు, ఓటర్ల డేటా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన విషయాల్లో అభ్యంతరం తెలిపినట్లు నివేదించింది. దీంతో ప్రతిపక్షాలు CEC జ్ఞానేష్ కుమార్‌ను టార్గెట్ చేశాయి. ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!