పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా దారుణంగా చంపేశారు. ఈ రోజు పెద్ద ఎత్తున్న ప్రజల మధ్య ఆయన అంతిమ సంస్కాారాలు పూర్తయ్యాయి. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక నిజాలు బయటపడ్డాయి. సిద్దూ శరీరంలో 24 బుల్లెట్ గాయాలు కనిపించాయని వైద్యులు వెల్లడించారు. కాళ్లు, పొట్ట, తలలో బుల్లెట్ గాయాలు ఉన్నాయి. బుల్లెట్లు సిద్దూ శరీరాన్ని ఛిద్రం చేశాయి. సిద్దూ లివర్ లో బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఐదుగురు డాక్టర్ల టీం సిద్దూకు పోస్ట్ మార్టం నిర్వహించారు. శరీరంలోని ప్రతీ భాగంలో కూడా బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ తో సిద్దూ మరణించారని వైద్యులు వెల్లడించారు.
ఈ రోజు ఆయన స్వగ్రామం మన్సాలో అంతిమ యాత్ర నిర్వహించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, ఆయన అభిమానాలు తరలివచ్చారు. సిద్దూ చివరి కార్యక్రమంలో ప్రజలు ఎక్కవగా పాల్గొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పంజాబ్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
పంజాబ్ లోని ఆప్ సర్కార్ 400 మందికి పైగా వ్యక్తులకు సెక్యురిటీ తొలగించిన 24 గంటల్లోనే సిద్దూ మూసేవాలా దారణహత్య జరిగింది. తన మహేంద్రా థార్ వాహనంలో బయటకు వెళ్లిన క్రమంలో పక్కా స్కెచ్ ప్రకారం దుండగులు సిద్దూపై పాయింట్ రేంజ్ లో కాల్పులు జరిపారు. దాదాపుగా 30 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్లు తెలిసింది. దుండగులు చంపడానికి ఏకే 47 రైఫిల్ వాడినట్లు తెలుస్తోంది. కెనడా గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ ఈ కేసులోె ప్రధాన నిందితులని అనుమానిస్తున్నారు.