కర్ణాటకలో మరోసారి రాజకీయాలు చేయడానికి మరో కొత్త అంశం దొరికింది. తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య చేసిన వ్యాఖ్యలపై రచ్చ నడుస్తోంది. తాను హిందువునని.. ఇప్పటి వరక బీఫ్ తినలేదని.. కావాలనుకుంటే బీఫ్ తింటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి కర్ణాటకలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభం అయింది. ఆర్ఎస్ఎస్ మతాల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తోందని తుముకూరులో జరిగిన ఓ సభలో వ్యాఖ్యానించారు. బీఫ్…