BJP: టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే కాంగ్రెస్ ఇలాగే మాట్లాడుతుంది.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..
- మల్లికార్జున ఖర్గే ‘‘టెర్రరిస్ట్ పార్టీ’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- కాంగ్రెస్ టెర్రరిస్టులకు మద్దతు ఇస్తుందని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ ఇటీవల కాంగ్రెస్‌ని ‘‘అర్బన్ నక్సల్స్’’ నడిపిస్తున్నారంటూ విమర్శించారు. ప్రధాని మోడీని వ్యాఖ్యల్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. బీజేపీ ‘‘టెర్రరిస్టుల పార్టీ’’గా విమర్శించారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం మొదలైంది. బీజేపీ ప్రజల్ని కొట్టి చంపడం, గిరిజనులు-దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. ‘‘వారు కొంత కాలం నిశ్శబ్దంగా ఉన్నారు. మళ్లీ హర్యానా విజయం తర్వాత మాట్లాడటం ప్రారంభించారు. వారు మేధావులు, ప్రగతిశీల వ్యక్తుల్ని అర్బన్ నక్సల్స్‌గా పిలుస్తారు. వారు ప్రజల్ని కొట్టి చంపుతారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తుల నోటిలో మూత్ర విసర్జన చేస్తారు.’’ అని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
అయితే, ఖర్గే విమర్శలపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారు, వేరేవారికి ఈ విషయాన్ని చెబుతున్నారు అని అన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అత్యంత దళిత వ్యతిరేక పార్టీ అని అన్నారు. ప్రజల్ని అవమానించడమే కాంగ్రెస్ గుర్తింపు అని, 2014, 2019, 2024లో ప్రజలు బీజేపీకి ఓటేశారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ డీఎన్ఏని తెలియజేస్తాయని పూనావాలా అన్నారు. కాంగ్రెస్ దళితుల గురించి మాట్లాడుతోంది.. హర్యానాలో కుమారి సెల్జాకి వారు ఏం చేశారు అంతా చూశారని, కర్ణాటకలో దళితుల కోసం ఉద్దేశించిన నిధుల్ని దోచుకున్నారని విమర్శించారు.
బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని, అవినీతిని ఏమాత్రం సహించని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది బీజేపీనే అని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో రాళ్లదాడిని అంతమొందించామని, ముంబైలాంటి టెర్రర్ అటాక్ ఎందుకు జరగలేదని కాంగ్రెస్ తమను తాము ప్రశ్నించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ యూపీఏ హయాంలో నిత్యం బాంబు పేలుళ్లు జరిగేవని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్‌గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!