India First Dengue Vaccine: శుభవార్త.. భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India First Dengue Vaccine: వర్షాకాలం ప్రారంభమైతే దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతుంటాయి. ప్రతి ఏడాది వేలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో తొలిసారిగా డెంగ్యూ నివారణ కోసం ‘QDENGA’ (క్యూడెంగా) వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం లభించింది.
వ్యాక్సిన్ ప్రత్యేకత ఏంటి? ఏ ఏజ్ వారికి..
ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమిటంటే, టీకా తీసుకునే ముందు డెంగ్యూ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో డెంగ్యూ వచ్చినవారు అయినా, ఎప్పుడూ డెంగ్యూ రాకపోయినా ఈ టీకాను తీసుకోవచ్చు. దీంతో డెంగ్యూ నివారణలో ఇది ఒక కీలక ముందడుగుగా వైద్య నిపుణులు భావిస్తున్నారు. QDENGA వ్యాక్సిన్‌ను రెండు డోసులుగా ఇస్తారు. మొదటి డోస్ తీసుకున్న మూడు నెలల తర్వాత రెండో డోస్ వేయించుకోవాలి. ఈ టీకాను చర్మం కింద (సబ్‌క్యూటేనియస్) ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ టకేడా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను 4 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వారికి వినియోగించేందుకు అనుమతించారు.
Also Read
- TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
భారత్‌లో డెంగ్యూ కేసులు ఎక్కువ..!
ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ కేసులు అధికంగా నమోదయ్యే దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచ డెంగ్యూ భారంలో దాదాపు మూడింట ఒక వంతు కేసులు భారతదేశంలోనే నమోదవుతున్నట్లు అంచనా. గత రెండు దశాబ్దాల్లో దేశంలో డెంగ్యూ కేసులు దాదాపు 11 రెట్లు పెరిగినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 2025లోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే అసలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా.
నాలుగు వైరస్‌లకు వాక్సిన్..
డెంగ్యూ వైరస్‌కు నాలుగు రకాల (సెరోటైప్స్) ఉన్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు రకాల వైరస్ల నుంచి రక్షణ కల్పించేలా QDENGAను రూపొందించారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వ్యాక్సిన్‌పై 28 వేల మందికి పైగా క్లినికల్ పరీక్షలు నిర్వహించారు. రెండో డోస్ తర్వాత 12 నెలలకు డెంగ్యూ నివారణలో 80.2 శాతం ప్రభావవంతంగా, డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని 90.4 శాతం వరకు తగ్గించడంలో ఇది సమర్థవంతంగా పనిచేసిందని అధ్యయనాలు సూచించాయి. దీర్ఘకాలిక పరిశోధనల్లో కూడా 4.5 సంవత్సరాల తర్వాత ఆసుపత్రి చికిత్స అవసరాన్ని 84.1 శాతం వరకు తగ్గించినట్లు గుర్తించారు.
WHO సిఫార్సు..
ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే సిఫార్సు చేసింది. నాణ్యత, భద్రత, ప్రభావం వంటి అంతర్జాతీయ ప్రమాణాలను ఇది అందుకుందని WHO ప్రీక్వాలిఫికేషన్ కూడా పొందింది. ప్రస్తుతం భారత్‌తో పాటు 43 దేశాల్లో ఈ వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 3.2 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేషియా వంటి దేశాల్లో ప్రజారోగ్య టీకా కార్యక్రమాల్లో దీనిని వినియోగిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
అయితే టీకా తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, పూర్తి చేతుల దుస్తులు ధరించడం, దోమల నివారణ మందులు, దోమతెరలు ఉపయోగించడం కొనసాగించాలి. అధిక జ్వరం, ఒళ్లునొప్పులు, ప్లేట్లెట్లు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
-
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!