అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో అనంత్ వదిన, ఆకాష్ భార్య శ్లోకా మెహతా అందమైన గులాబీ రంగు డ్రస్‌లో మెరిసిపోయింది. అయితే ఇక్కడ విచిత్రమేంటంటే.. ఆమె పెళ్లి సందర్భంగా ధరించిన డ్రస్‌నే తిరిగి ధరించింది. మరోసారి తమ పెళ్లిని గుర్తుచేసుకునేలా.. ఆకాష్-శ్లోకా మెహతా మధ్య ఉన్న ప్రేమను గుర్తుచేసుకునేందుకు శుక్రవారం జరిగిన అనంత్-రాధిక పెళ్లిలో రిపీట్‌గా ధరించి గత అనుభవాల్ని గుర్తుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్లోకా సోదరి దియా మెహతా ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
శ్లోకా మెహతా.. గులాబీ రంగు కలిగిన లెహంగాను ధరించి పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు. అప్పుడు చిన్నపాటి నెక్లస్ ధరించగా.. ఇప్పుడు మెడలో మరింత వజ్రాభరణాలను ధరించి ప్రకాశవంతంగా మెరిసింది. శ్లోకా మెహతా డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా ప్రత్యేకంగా డిజైన్ చేసి కొత్త లుక్ సృష్టించారు. రాధిక, ఇసా అంబాలకు కూడా వీళ్లే డిజైన్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే అనంత్‌కు జంతువులంటే చాలా మక్కువ.. గుజరాత్‌లో ప్రత్యేకంగా అడవిని సృష్టించి జంతువుల్ని పెంచుతున్నారు. దీంతో అనంత్ కోసం శ్లోకాకు జంతువులతో కూడిన డ్రస్‌ను డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.
ఆకాష్ అంబానీ-శ్లోకా మెహతా పెళ్లి 2019లో జరిగింది. అప్పట్లో ఈ పెళ్లి కూడా చాలా గ్రాండ్‌గా చేశారు. తాజాగా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అంతకంటే రెట్టింపుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులు హాజరయ్యారు. శుక్రవారం అనంత్-రాధిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. శని, ఆదివారాల్లో కూడా ముంబై వేదికగా వేడుకలు జరగనున్నాయి.