Anant Ambani Wedding: అనంత్ పెళ్లిలో వదిన శ్లోకా స్పెషల్ ఎట్రాక్షన్.. మరిది కోసం ఏం చేసిందంటే..!
- అనంత్ పెళ్లిలో వదిన శ్లోకా స్పెషల్ ఎట్రాక్షన్
- మరిది కోసం డ్రస్‌లో ప్రేమను వ్యక్తపరిచిన శ్లోకా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథుల మధ్య ఏడడుగుల బంధంతో జంట ఒక్కటైంది. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని రంగాల సినీ ఇండస్ట్రీల ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.. ఆనందోత్సవాలతో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేశారు.

Also Read
ఇక అనంత్ అంబానీ పెళ్లిలో వదిన శ్లోకా అంబానీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. మరిదికి ఇష్టమైన వాటిని వస్త్రాల రూపంలో ధరించి స్పెషల్‌గా నిలిచింది. అనంత్ అంబానీకి జంతువులు అంటే చాలా ఇష్టం. ఇందుకోసం గుజరాత్లో ప్రత్యేకంగా ఫారెస్ట్ కూడా ఏర్పాటు చేసి జంతువుల్ని పెంచుతున్నారు. దీంతో మరిదికి జంతువులపై ఉన్న మక్కువతో శ్లోకా అంబానీ.. జంతువుల బొమ్మలతో కూడిన దుస్తులు ధరించి ప్రేమను కురిపించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియోలు పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అనంత్ అంబానీ పెళ్లి కోసం శ్లోకా అంబానీకి డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా స్పెషల్‌గా డ్రస్ తయారు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను డిజైనర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రకృతి మరియు జంతువుల పట్ల అనంత్‌కు ఉన్న అభిరుచికి నివాళులు అర్పిస్తూ శ్లోకా కోసం వస్త్రాలను అందంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.
ఇక శనివారం ముంబై వేదికగా డ్యాన్స్ ప్రోగ్రాం జరగనుంది. ఇందుకోసం దేశ, విదేశాల నుంచి 60 మంది స్పెషల్ డ్యాన్సర్లను తీసుకొచ్చారు. ఆదివారం మాత్రం రిసెప్షన్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి అతిరథ మహరథులంతా మళ్లీ హాజరుకానున్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!