Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
- డీజిల్ ఒప్పందం తర్వాత, మరో ఒప్పందం దిశగా అమెరికా-రష్యా..
- డేటా సెంటర్లకు విద్యుత్, సంయుక్త డేటా సెంటర్ల ప్రాజెక్టుపై చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-US: అమెరికా, రష్యాల మధ్య బంధం బలపడుతోంది. ఇటీవల రష్యా నుంచి అమెరికా భారీ స్థాయిలో డీజిల్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం తర్వాత రెండు దేశాలు మరో కీలక ఒప్పందానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో వేగంగా పెరుగుతున్న డేటా సెంటర్లకు రష్యా నుంచి అణు విద్యుత్ సరఫరా చేసే అవకాశాలపై ఇరు దేశాలే చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడిగా పేరున్న కిరిల్ డిమిత్రియేవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికా, రష్యాలు కలిసి డేటా సెంటర్ల ప్రాజెక్టును చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్నింటికి రష్యా అణువిద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ సరఫరా చేయవచ్చని కిరిల్ పేర్కొన్నారు. చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్లను ఉపయోగించే అవకాశాలపై కూడా ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. కృత్రిమ మేధ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాలు విస్తరిస్తుండటంతో డేటా సెంటర్లకు అవసరమయ్యే విద్యుత్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థిరమైన, నిరంతర విద్యుత్ కోసం అణు విద్యుత్‌ను ఎంచుకుంటున్నారు.
Also Read
- Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
- Shehbaz Sharif: "మా దేశ అభివృద్ధిలో హిందువుల పాత్ర కీలకం".. దీపావళి విషెస్ తెలిపిన పాకిస్థాన్ ప్రెసిడెంట్, పీఎం..
- Israel Government Formation: నెతన్యాహూ అధికారానికి బ్రేక్?.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్కోట్కు తొలి అవకాశం
- Japan Earthquake: జపాన్‌లో 5.7 తీవ్రతతో భారీ భూకంపం.. 22 మందికి గాయాలు
రష్యా, అమెరికా మద్య ఇటీవల డీజిల్ ఒప్పందం కుదిరింది. దీని తర్వాత డేటా సెంటర్లకు విద్యుత్ సరఫరా అంశం తెరపైకి వచ్చింది. పెరుగుతున్న ఇంధన ధరలను అరికట్టే లక్ష్యంతో, దేశీయ మరియు ప్రపంచ మార్కెట్ల కోసం 3 లక్షల టన్నులకు పైగా రష్యన్ డీజిల్‌ను కొనుగోలు చేయడానికి అమెరికా, రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏప్రిల్ 2027 వరకు రష్యన్ డీజిల్‌కు సంబంధించిన లావాదేవీలకు అధికారం ఇస్తూ అమెరికా ట్రెజరీ శాఖ ఒక తాత్కాలిక సాధారణ లైసెన్స్‌ను జారీ చేసింది.
తాజావార్తలు
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
-
Scam: నల్లగొండలో నకిలీ ఉద్యోగ స్కాం.. రిటైర్మెంట్ తర్వాత డెత్ డ్రామా..
-
Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!