Shreya Ghoshal: ‘‘వెన్నులో వణుకు పుట్టిస్తోంది’’..కోల్‌కతా ఘటనపై శ్రేయా ఘోషల్ స్పందన..
- కోల్‌కతా వైద్యురాలి ఘటనపై స్పందించిన సింగర్ శ్రేయా ఘోషల్..
- ఘటన వెన్నులో వణుకు పుట్టిస్తోంది..
- కోల్‌కతాలో జరిగాల్సిన మ్యూజిక్ ఈవెంట్ క్యాన్సిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreya Ghoshal: ప్రముఖ గాయని, జాతీయ అవార్డు విన్నర్ శ్రేయా ఘోషల్ కోల్‌కతాలో సెప్టెంబర్ 14న జరగాల్సిన తన కచేరిని వాయిదా వేసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనతో యావత్ దేశం అట్టుడికింది. బాధితురాలకి న్యాయం చేయాలంటూ డాక్టర్ల, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బెంగాల్ వ్యాప్తంగా ఇప్పటికీ నిరసలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: Rahul Gandhi: అమెరికాకు రాహుల్ గాంధీ.. డల్లాస్, వాషింగ్టన్ డీసీల్లో పర్యటన..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఈ నేపథ్యంలోనే శ్రేయా ఘోషల్ కార్యక్రమం వాయిదా పడింది. ఈ కచేరీని అక్టోబర్‌లో కొత్త తేదీకి మార్చనున్నారు. వైద్యురాలి ఘటనపై శ్రేయా ఘోషల్ స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘భయంకరమైన మరియు హేయమైన సంఘటనతో తాను తీవ్రంగా ప్రభావితమయ్యాను. నేను కూడా ఓ స్త్రీ అయినందున ఆమె అనుభవించిన దారుణమైన క్రూరత్వం యొక్క ఆలోచన ఊహిచలేనిది. నా వెన్నులో వణుకు పుట్టిస్తోంది.. నేను ఓ స్టాండ్ తీసుకోవడం, మీ అందరికి సంఘీభావం తెలియజేయడం తప్పనిసరి. మన దేశంలోనే కాకుండా ఈ ప్రపంచంలోని మహిళల గౌరవం మరియు భద్రత కోసం నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను’’ అని ఆమె పోస్టులో రాశారు.
ఆగస్టు 09న కాలేజీలోని సెమినార్ హాలులో నిద్రిస్తున్న సమయంలో వైద్యురాలిపై సంజయ్ రాయ్ అనే నిందితుడు అత్యాచారం, హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో కోల్‌కతా పోలీసులు, మమతా బెనర్జీ సర్కార్ తీవ్రంగా వైఫల్యం చెందిందని కలకత్తా హైకోర్టు పేర్కొంటూ, ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై వైద్యులు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడంతో, సుప్రీంకోర్టు కలుగజేసుకుని వారంతా విధుల్లో్ చేరాలని కోరింది.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!