Sanjay Raut: శివసేన- ఎంఎన్‌ఎస్ మధ్య పొత్తు.. కాంగ్రెస్ పై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..!
- మహారాష్ట్రలో శివసేన- మహారాష్ట్ర నవనిర్మాణ సేన మధ్య పొత్తుకుదురింది..
- శివసేన- ఎంఎన్ఎస్ తో జత కట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఇష్టపడటం లేదు..
- మాతో కలిసి వచ్చే పార్టీలతోనే బీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం: ఎంపీ సంజయ్ రౌత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: మహారాష్ట్రలో శివసేన (UBT), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) కూటమిలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఉన్నప్పటికీ, అది ఏమాత్రం పట్టించుకోదగిన విషయం కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈరోజు (నవంబర్ 22) ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ పొత్తు కోసం ఢిల్లీలోని తమ అధిష్టానంతో చర్చించకుండా ఎలాంటి హామీ ఇవ్వడానికి ఆలోచిస్తుంది.. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది వారి వ్యక్తిగత విషయమేనన్నారు. కానీ శివసేన- ఎంఎన్‌ఎస్ ఎవరి అనుమతి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, ప్రజల కోరిక మేరకే మా రెండు పార్టీలు ఒక్కటయ్యాయి.. దీనికి ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. తమతో కలిసి వచ్చేందుకు శరద్ పవార్- వామపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయని సంజయ్ రౌత్ వెల్లడించారు.
Read Also: Ibomma Ravi: మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం.. రవిని స్వయంగా విచారిస్తున్న సీపీ సజ్జనార్!
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ఇక, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) సైతం బీజేపీని ఎదుర్కోవడానికి అందరూ ఏకమవ్వడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఎన్‌సీపీ, శివసేన (యూబీటీ)తో పొత్తును ఖరారు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.. ఇది పరోక్షంగా ఎంఎన్‌ఎస్‌ను కూడా కూటమిలో చేర్చుకోవడానికి ఒప్పుకున్నట్లేనని తెలిపారు. ఎంవీఏ (మహా వికాస్ అఘాడి) పార్టీలైన సమాజ్‌వాదీ, కమ్యూనిస్ట్ పార్టీలు, అంబేద్కర్ పార్టీల కార్యకర్తలంతా కలిసి పోరాడాలని అనుకుంటున్నారని ఎన్‌సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అహ్వాడ్ చెప్పుకొచ్చారు.
Read Also: IBomma Ravi Custody: విచారణలో బొమ్మ చూపిస్తున్న రవి.. రంగంలోకి ఎథికల్ హ్యాకర్స్?
అయితే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేనను హిందూ భావజాలం కలిగినపార్టీగా చూస్తూ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. కావునా, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఎంవీఏ పార్టీలతో పాటు తన సోదరుడు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్‌తో కలిసి పోటీ చేయాలని ఉద్ధవ్ ఠాక్రే పట్టుదలతో ఉన్నారు. కాబట్టి, కాంగ్రెస్‌ను ఈ కూటమిలో చేర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. బీఎంసీకి ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్నాయి. కాగా, కాంగ్రెస్ ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడంతో.. మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఎన్నికల ఐక్యతపై సందేహాలు నెలకొన్నాయి. శివసేన (యూబీటీ) ఎంఎన్‌ఎస్‌తో సాన్నిహిత్యం కాంగ్రెస్‌కు నచ్చక పోవడంతోనే బీఎంసీ ఎన్నికలకు కూటమికి దూరంగా ఉంటుంది. ఠాక్రే బ్రదర్స్ పునఃకలయకను కాంగ్రెస్ స్వాగతించినప్పటికీ, ఎంఎన్‌ఎస్‌తో రాజకీయ పొత్తుకు మాత్రం దూరంగా ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?