రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన మద్దతుపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ప్రకటించింది.సోమవారం ఎంపీలతో జరిగిన కీలక భేటీలవో మెజారిటీ సభ్యులు ద్రౌపది ముర్ము వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శివసేన అధిష్ఠానం కూడా ఆ దిశగా సానుకూలత వ్యక్తం చేస్తోంది.
Indane Gas Cylinder : మహిళలకు శుభవార్త.. ఇక బ్లాస్ట్ ప్రూఫ్ సిలిండర్లు..
మహారాష్ట్ర జనాభాలో పది శాతం ఎస్టీ జనాభా ఉండగా.. గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని సేన ఎంపీలు ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ముర్ముకే మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. దీంతో శివసేన రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో దాదాపుగా ఒక స్పష్టత వచ్చినట్లయ్యింది. శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ కూడా రాష్ట్రపతి అభ్యర్థి మద్థతు విషయంలో స్పష్టత ఇచ్చారు. సోమవారం ఎంపీల సమావేశంలో ద్రౌపది ముర్ము మద్దతు అంశంపై ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. ముర్ముకు మద్దతు ఇచ్చినంత మాత్రాన బీజేపీకి సపోర్ట్ చేసినట్లు కాదంటూ వ్యాఖ్యానించారు. యశ్వంత్ సిన్హా విషయంలోనూ శివసేన సానుకూలంగానే ఉందన్నారు. గతంలో ఎన్డీయే అభ్యర్థికి కాకుండా ప్రతిభా పాటిల్‌కు, ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చామన్నారు. శివసేన ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటుందని సంజయ్ రౌత్ అన్నారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.