Maharashtra: డ్రైవర్‌కు రూ.150 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన ఎంపీ.. రంగంలోకి అధికారులు!
- డ్రైవర్‌కు రూ.150 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన ఎంపీ
- రంగంలోకి అధికారులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంత అభిమానం ఉన్నా.. లేదంటే ఎంత ప్రేమ ఉన్నా.. రక్తసంబంధులైనా ఏదో కొంత సాయం చేయడమో.. గిఫ్ట్‌గా ఇవ్వడమో చేస్తుంటారు. అంతేకానీ కోట్లకు కోట్ల ఆస్తులైతే ఇవ్వరు కదా? కానీ మహారాష్ట్రలో మాత్రం ఒక ఎంపీ ఏకంగా తన కారు డ్రైవర్‌కు రూ.150 కోట్ల విలువైన ఆస్తిని గిఫ్ట్‌గా ఇచ్చేశారు. అతడు రక్తసంబంధి కాదు.. బంధువు కాదు.. అయినా కూడా అన్ని కోట్ల విలువైన ఆస్తిని గిఫ్ట్‌గా ఎలా ఇచ్చారంటూ తీవ్ర చర్చనీయాంశమైంది. రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Visakhapatnam: గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట!
Also Read
- Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలే..
- Mamata Banerjee: "అప్పటి వరకు నేను చావను".. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
- Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన ఎంపీ సందీప్ భూమ్రే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలాస్ దగ్గర జావెద్ రసూల్ షేక్ అనే వ్యక్తి 13 ఏళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న హైదరాబాద్ నిజాం దివాన్ వారసులకు చెందిన రూ.150 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని గిఫ్ట్‌గా రాసిచ్చేశారు. దీనిపై న్యాయవాది ముజాహిద్ ఖాన్ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ భూమిపై దివాన్ వారసులు సుదీర్ఘమైన న్యాయపోరాటం చేశారని, 2022లో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని దక్కించుకోగలిగారని ముజాహిద్ తెలిపారు. అలాంటి భూమిని రక్తసంబంధం లేని వ్యక్తికి గిఫ్ట్‌గా ఎలా ఇస్తారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Hyderabad: బుద్ధిగా చదువుకోమని చెప్పడమే తల్లి అంజలి చేసిన నేరమా..!
నిజాం దివాన్ వారసులతో తనకు సత్ససంబంధాలు ఉన్నాయని.. ఆ కుటుంబంతో బాగా పరిచయం కూడా ఉందని డ్రైవర్ జావెద్ రసూల్ షేక్ తెలిపాడు. అందుచేతనే ఆ భూమిని తనకు ఎంపీ గారు బహుమతిగా ఇచ్చారని పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసుల విచారణంలో డ్రైవర్ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ విషయంపై పోలీసులు తనను సంప్రదించినట్లు ఎమ్మెల్యే విలాస్ భూమ్రే అంగీకరించారు. పోలీసుల నుంచి తనకు ఫోన్ వచ్చిందని చెప్పారు. డ్రైవర్‌తో ఎన్నేళ్లుగా పరిచయం ఉందని అడిగారని.. భూమి బదిలీ గురించి కూడా వాకబు చేసినట్లు చెప్పారు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తన దగ్గర లేవనట్లుగా చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలే..
-
Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. ‘పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
-
Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3 నోటిఫికేషన్ లు విడుదల చేసిన TGPSC
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!