BMW hit-and-run case: శివసేన నుంచి ‘హిట్ అండ్ రన్’ నిందితుడి తండ్రి సస్పెండ్..
- ముంబై కార్ యాక్సిడెంట్ కేసు..
- నిందితుడి తండ్రిపై శివసేన వేటు..
- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సీఎం షిండే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMW hit-and-run case: ముంబైలో బీఎండబ్ల్యూ కార్ యాక్సిడెంట్ కేసు ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం ఏక్‌నాథ్ షిండేకి చెందిన శివసేన పార్టీ నాయకుడు కుమారుడే ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్నారు. ఆదివారం ముంబైలోని వర్లీ ప్రాంతంలో కారుని వేగంగా నడుపుతూ స్కూటర్‌పై వస్తున్న భార్యభర్తల్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో 45 ఏళ్ల మహిళ మరణించింది. నిందితుడైన మిహిర్ షా, పాల్ఘర్ జిల్లా శివసేన ప్రధాన నాయకుడైన రాజేష్ షా కుమారుడు. ఘటన జరిగిన సమయంలో కారులోనే మిహిర్ షాతో పాటు అతని డ్రైవర్ ఉన్నట్లుగా తేలింది.
Read Also: Kenza Layli : తొలి మిస్ ఏఐ కిరీటాన్ని కైవసం చేసుకున్న మొరాకో ఇన్‌ఫ్లుయెన్సర్..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఈ నేపథ్యంలోనే శివసేన నుంచి రాజేష్ షాని సస్పెండ్ చేశారు. అతని సస్పెన్షన్‌ని సీఎం షిండే ఆమోదించారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడు మిహిర్ షా పరారయ్యాడు. 72 గంటల తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రాజేష్ షాని ఆదివారం అరెస్ట్ చేసిన పోలీసులు, బెయిల్‌పై విడుదల చేశారు. మిహిర్ షా తప్పించుకోవడానికి రాజేష్ షా మరియు బిదావత్ సహాయం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మిహిర్ షా మరియు అతని నలుగురు స్నేహితులు జుహులోని వైస్-గ్లోబల్ తపస్ బార్‌లో ఉన్న కొన్ని గంటల తర్వాత ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ముంబైలో కనీన మద్యపాన వయసు 25 ఏళ్లు, కాగా నిందితుడి మిహిర్ షాకు 24 ఏళ్లు. మద్యం అందించిన బార్ షాపుని ముంబై పురపాలక అధికారులు కూల్చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను కావేరీ నఖ్వాగా గుర్తించారు. ఆమె భర్త ప్రదీప్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ దారుణమైన ఘటనక పాల్పడిన మిహిర్ షాను ఉరితీయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!