Sherlyn Chopra Shocking Comments On Sajid Khan: బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌ను బిగ్‌బాస్ షోలోకి తీసుకోవడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అతడ్ని ఆ షోలో నుంచి తొలగించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. చివరికి ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్ కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తూ.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాశారు. అటు.. నటి షెర్లీన్ చోప్రా ‘ప్రైవేట్’ పార్ట్ అంటూ, అతనికి సంబంధించిన ఓ షాకింగ్ రహస్యాన్ని కూడా బట్టబయలు చేసింది. అసలేం జరిగింది? ఎందుకు సాజిద్ ఖాన్‌పై ఇంత దుమారం రేగుతోంది?
దేశంలో మీటూ ఉద్యమం చెలరేగిన సమయంలో.. సాజిద్ ఖాన్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. అతడు తమను లైంగికంగా వేధించాడని, బెడ్రూంకి తీసుకెళ్లి తమను లైంగికంగా వంచించేందుకు ప్రయత్నించాడని కొందరు మహిళలు అతనిపై ఆరోపణలు చేశారు. అప్పట్లో అవి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవ్వడంతో.. 2018లో అతడ్ని ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టీడీఏ) నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అలాగే.. ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు అతడు హిందీ బిగ్‌బాస్-16లో పాల్గొంటున్న నేపథ్యంలో.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎలా షోకి తీసుకొస్తారంటూ వ్యతిరేకతలు వస్తున్నాయి. ఈ సందర్భంగానే నటి షెర్లీన్ చోప్రా ఓ బాంబ్ పేల్చింది.
‘‘ఓసారి సాజిద్ ఖాన్ తన ప్రైవేట్ పార్ట్‌ని చూపించి, దానికి 10 వరకు ఎంత రేటింగ్ ఇస్తావని అడిగాడు. నేను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి, అతనికి రేటింగ్ ఇవ్వాలని అనుకుంటున్నా. ఒక మోలెస్టర్‌ని సర్వైవర్ ఎలా డీల్ చేసిందో దేశానికి తెలియనివ్వండి’’ అని షెర్లీన్ ట్విటర్‌లో రాసుకొచ్చింది. అలాగే.. సల్మాన్ ఖాన్ ఈ విషయంలో జోక్యం చేసుకొని, సాజిద్‌ని తప్పించాల్సిందేనని కోరింది. మరోవైపు.. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్ స్పందిస్తూ.. ‘‘మీటూ ఉద్యమ సమయంలో 10 మంది మహిళలు సాజిద్ ఖాన్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. ఇప్పుడు అతనికి బిగ్‌బాస్ షోలో స్థానం ఇచ్చారు. ఇది తప్పు. సాజిద్‌ను ఆ షో నుంచి తప్పించాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాశాను’ అని ఆమె ట్విటర్ వేదికగా వెల్లడించారు.