Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
- డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానన్న షేక్ హసీనా
- కోర్టులో స్వచ్ఛందంగా లొంగిపోతానని ప్రకటన
- మరణశిక్ష, ప్రాణహాని ఉన్నా వెనక్కి తగ్గనని వ్యాఖ్య
- తనపై కేసులు రాజకీయ కక్షతో పెట్టినవేనని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. 2024లో హింసాత్మక నిరసనల సమయంలో ఆమె భారత్‌కు పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలా ఉంటే, 2026 డిసెంబర్లో తాను బంగ్లాదేశ్‌కు వెళ్తానని, అక్కడి కోర్టులో లొంగిపోతానని ప్రకటించారు. తనకు మరణశిక్ష విధించినప్పటికీ, తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ, సొంత దేశానికి వెళ్లే నిర్ణయాన్ని మార్చుకోనని చెప్పారు. రాయిటర్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
2024 ఆగస్టులో హింసాత్మక నిరసనల సమయంలో పలువురు మరణాలకు, అణచివేతకు షేక్ హసీనా కారణమని ఆమెకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) మరణశిక్ష విధించింది. అయితే, ఈ ఆరోపణల్ని హసీనా తీవ్రంగా ఖండించారు. ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ పలుమార్లు భారత్‌ను కోరింది. ఈ తరుణంలో షేక్ హసీనా నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
‘‘నేను తిరిగి వెళ్తే, నన్ను అరెస్ట్ చేయవచ్చు. వారు నన్ను చంపొచ్చు, అయినా నేను వెళ్లాల్సిందే. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నా పార్టీ నాయకులు, కార్యకర్తలు భయంకరమైన అఘాయిత్యాలను, అణచివేతను ఎదుర్కొంటున్నారు. నేను చనిపోవాల్సి వస్తే, నా తల్లిదండ్రులను ఖననం చేసిన, వారి రక్తం చిందిన నా సొంత గడ్డపైనే అది జరగాలని కోరుకుంటున్నాను.’’ అని ఆమె అన్నారు. షేక్ హసీనాతో పాటు అప్పటి హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ కూడా వెళ్లే అవకాశం ఉంది. తనపై నమోదైన కేసులు రాజకీయ కక్షతో పెట్టినవేనని ఆమె ఆరోపించారు. కోర్టు విచారణ ప్రారంభమైతే నిజం ప్రజలకు తెలుస్తుందని, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?