UtterPradesh Woman: కొన్ని సందర్భాల్లో కొందరికి అదృష్టం కలిసి వస్తే.. మరికొన్ని సార్లు దురదృష్టం వెంటాడుతుంటుంది. ఇక్కడ ఒక మహిళకు మాత్రం అదృష్టం వరించి ఆమె మృత్యుంజయురాలుగా మారింది. మహిళ ఆకస్మాత్తుగా స్పృహతప్పి రైలు పట్టాల మధ్య పడిపోయింది. ఇంతలో ఓ గూడ్సు రైలు ఆమె పడిపోయిన ట్రాక్‌పై నుంచి దూసుకెళ్లింది. 30 సెకన్ల పాటు ఆ మహిళ రైల్వే ట్రాక్ మధ్యలో గూడ్స్ రైలు కింద పడి ఉంది. ఆ మహిళ మృత్యువును చాలా అంటే.. చాలా దగ్గరగా చూసింది. ఆమె పై నుంచి రైలు వెళ్లినా.. ఆమె మాత్రం ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది..
Read also: Vande Bharat: విజయవాడ – చెన్నై వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ప్రారంభానికి ముహూర్తం ఖరారు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్గంజ్లో ఆర్య నగర్‌కు చెందిన 40 ఏళ్ల హర్ప్యారీ.. మందులు తీసుకెళ్లాడానికి సహవర్ రైల్వేస్టేషన్ వైపు వెళ్లింది. ఆమె పట్టాలు దాటుతుండగా.. సడెన్ గా గూడ్స్ రైలు వచ్చింది. గూడ్స్ రైలును చూసిన హర్ప్యారీ భయపడి ట్రాక్‌పైనే పడిపోయింది. ఆమెను రైల్వే ట్రాక్‌పై నుంచి పక్కకు తీసేందుకు కొందరు వ్యక్తులు అక్కడికి పరుగెత్తారు. అయితే అంతలోనే గూడ్సు రైలు ఆమె పడిపోయిన ట్రాక్ పైకి వచ్చింది. దీంతో చేసేదేమీ లేక తోటివారు ఊరుకున్నారు. ఆమె పై నుంచి రైలు వెళ్తుండగా.. ఆమెకు మెలుకువ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు.. కాళ్లు, చేతులు కదపకుండా అలాగే ఉండాలంటూ.. కేకలు వేశారు. హర్ప్యారీ 30 సెకన్ల పాటు గూడ్స్ రైలు కింద అలాగే భయంతో వణికిపోతూ పడి ఉంది. అప్పుడు లోకో పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందిన వెంటనే లోకో పైలట్ రైలును ఆపేశాడు. అక్కడే ఉన్న ప్రజలు ఆ మహిళను బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఆమె ట్రాక్ మధ్యలో పడిపోయినందున ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. లేకపోతే ప్రాణాలే పోయేవి.