Shashi Tharoor: మోడీపై శశి థరూర్ ప్రశంసలు.. చిక్కుల్లో రాహుల్ గాంధీ..
- మోడీపై శశి థరూర్ ప్రశంసలు..
- భారత నావికుల రక్షణను ట్రంప్ ముందు ప్రస్తావించారన్న ఎంపీ..
- ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు..
- రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: ప్రధాని నరేంద్రమోడీపై, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోడీ, ట్రంప్ మధ్య జరిగిన భేటీపై థరూర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో, భారత నావికుల భద్రతా అంశాన్ని మోడీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారని థరూర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింది.
జీ7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్‌లో మోడీ-ట్రంప్ సమావేశం జరిగింది. గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తు్న్న భారత నావికుల భద్రతపై మోడీ ఆందోళన వ్యక్తం చేసినట్లు థరూర్ అన్నారు. యుద్ధ పరిస్థితుల్లో నావికులను టార్గెట్ చేయడం సరికాదని మోడీ స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు. ‘‘ నావికులు సైనికులు కారు. యుద్ధ సమయంలో వారిని లక్ష్యంగా చేసుకోవద్దని మోడీ ట్రంప్‌కు చెప్పారు’’ అని థరూర్ అన్నారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా దాడి వల్ల ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. అయితే, ఈ ఘటనపై ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో థరూర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
ఈ వ్యాఖ్యల్ని బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. థరూర్ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ వైఖరిని బహిర్గతం చేశాయని అన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో మోడీ ముందుంటారని, కానీ రాహుల్ గాంధీ మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని ఫైర్ అయ్యారు. దాదాపు 16 నెలల తర్వాత, ఫ్రాన్స్ జీ7 సదస్సు వేదికగా ట్రంప్, మోడీ భేటీ అయ్యారు. ఈ సమయంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం గురించి ప్రస్తావించారు. నావికుల భద్రతను ట్రంప్ ముందు మోడీ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!