Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’పై అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఐశ్వర్య లక్ష్మి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం కానుండటం, పైగా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ కావడంతో ‘రాకా’పై నార్త్ నుంచి సౌత్ వరకు భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోందని ప్రచారం జరుగుతున్న ఈ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌పై సన్ పిక్చర్స్ నిన్న రిలీజ్ చేసిన ఓ మినిమలిస్టిక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పోస్టర్లో కేవలం 37 అనే నంబర్ మాత్రమే ఉంది. దానికి తోడు సమ్‌థింగ్ బిగ్ ఈజ్ లోడింగ్ అనే క్యాప్షన్ ఉండటంతో ఈ నంబర్ వెనుక అసలు అర్థం ఏంటనే చర్చ మొదలైంది.
‘రాకా’ కథ పురాతన వేద కాలం, ఆధునిక ప్రపంచం అనే రెండు విభిన్న కాలాల నేపథ్యంలో పునర్జన్మ కాన్సెప్ట్ చుట్టూ సాగుతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి భారీ కథతో తెరకెక్కుతున్న సినిమాకు కేవలం 37 అనే నంబర్‌తో పోస్టర్ వదలడంతో అభిమానులు తమదైన స్టైల్లో డీకోడ్ చేయడం మొదలుపెట్టారు. వాటిలో ఎక్కువగా వినిపిస్తున్న థియరీ మాత్రం సెప్టెంబర్ 21తో లింక్ అయి ఉంది. 3ను 7తో గుణిస్తే 21 వస్తుంది. సెప్టెంబర్ 21 దర్శకుడు అట్లీ పుట్టినరోజు కావడంతో అదే రోజు ‘రాకా’ నుంచి ఏదైనా పెద్ద అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ గ్లింప్స్ లేదా భారీ సర్ప్రైజ్ అనౌన్స్‌మెంట్‌ను అట్లీ బర్త్‌డే సందర్భంగా విడుదల చేయవచ్చని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ థియరీ కూడా వినిపిస్తోంది. 37లోని 3, 7 నంబర్లను సినిమా కథలోని పాత్రలతో లింక్ చేస్తూ కొందరు అభిమానులు అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు సినిమాలో మొత్తం ఏడుగురు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందని కూడా కొందరు నెటిజన్లు చర్చిస్తున్నారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
మరోవైపు సెప్టెంబర్ 20 సాయంత్రం ‘రాకా’కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ 37 పోస్టర్‌కు సంబంధించిన క్లూ కూడా అందులో ఉంటే మాత్రం ఫ్యాన్స్ డీకోడింగ్‌కు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ‘రాకా’ 2028లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఉన్నప్పటికీ, ఆఫీషియల్ డేట్ ను ఇంకా రివీల్ చేయలేదు. ప్రస్తుతం మాత్రం అందరి చూపు సెప్టెంబర్ 20 మేకింగ్ వీడియో, ఆ తర్వాత సెప్టెంబర్ 21 అట్లీ బర్త్‌డేపై ఉంది. మరి పోస్టర్‌లోని 37 నంబర్ నిజంగానే ఏదైనా భారీ సర్ప్రైజ్కు సంకేతమా? లేక ఫ్యాన్స్ ఊహిస్తున్నట్లుగా ఇందులో మరో పెద్ద ట్విస్ట్ దాగి ఉందా? తెలియాలంటే మేకర్స్ నుంచి వచ్చే ఆఫీషియల్ అప్డేట్ వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!