Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir on vaibhav sooryavanshi: భారత టీ20 జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సూచన చేశాడు. ప్రస్తుతం జట్టులో సీనియర్ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో వైభవ్ మరికొంతకాలం తన అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడాల్సిందేనని గంభీర్ స్పష్టం చేశాడు.
అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత సెంచరీతో రికార్డులు బద్దలు కొట్టాడు. కేవలం 30 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన అభిషేక్.. భారత్‌కు 127 పరుగుల భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
అఫ్గానిస్థాన్ సిరీస్‌లో గౌతమ్ గంభీర్ ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లకే ప్రాధాన్యం ఇచ్చాడు. ఇద్దరూ అద్భుతంగా రాణించడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, అఫ్గానిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా నిలిచారు. దీంతో వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. వైభవ్ విషయంలో జట్టు మేనేజ్మెంట్తో చర్చ జరిగిందని గంభీర్ తెలిపాడు. “వైభవ్ తన అవకాశం కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. అతడి ప్రతిభ, అతడు ఏం చేయగలడో మాకు తెలుసు. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా నిరంతరం రాణిస్తున్న ఆటగాడు.. ఇప్పుడే జట్టులోకి వచ్చిన ఆటగాడి కంటే ముందుంటాడు” అని గంభీర్ పేర్కొన్నాడు.
అయితే వైభవ్‌కు అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇస్తామని గంభీర్ స్పష్టం చేశాడు. “అతడికి అవకాశం వచ్చినప్పుడు సుదీర్ఘమైన అవకాశాలు లభిస్తాయి. భారత క్రికెట్ అంటే ఇదే. జట్టులో ప్రతిభ, పోటీ ఉండాలని మేం కోరుకుంటాం. కానీ క్రికెట్లో అవకాశం కోసం ఎదురుచూడాల్సిన సందర్భాలు ఉంటాయి” అని చెప్పాడు. వైభవ్ వయసును కూడా ప్రస్తావించిన గంభీర్.. ఆటగాడు 15 ఏళ్ల వాడైనా, 30 ఏళ్ల వాడైనా అవకాశం కోసం వేచి ఉండాల్సి వస్తే తప్పదని అన్నాడు. దీంతో టీ20ల్లో వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడే ఓపెనింగ్ అవకాశం దక్కకపోవచ్చనే సంకేతాలను గంభీర్ ఇచ్చాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!