Several fall ill after eating food at wedding ceremony in MP: పెళ్లి భోజనం తినేసి బంధువలంతా ఇళ్లు చేరారు. అయితే భోజనం తిన్న కొద్ది గంటలకే విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి భోజనం ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 100కు పైగా మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read Also: Badruddin Ajmal: హిందువులు పెళ్లికి ముందు రెండు, మూడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు..
మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని ఓ వివాహ వేడుకలో భోజనం విషతుల్యం అయింది. భోజనం చేసిన తర్వాత చాలా మంది వ్యక్తులు ఒకరితర్వాత ఒకరు వరసగా అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11గంటలకు పెళ్లిలో భోజనం చేసిన తర్వాత శనివారం తెల్లవారుజామున 3 గంటలకు వారంతా విపరీతమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. కనీసం 20 మంది వరకు స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చేరారని శనివారం జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
శుక్రవారం రాత్రి ధార్ లోని ధామ్‌నోద్‌లో జరిగిన వివాహ వేడుకలో భోజనం చేసిన తర్వాత పలువురు వాంతులు చేసుకున్నారని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ బ్రహ్మరాజ్ కౌశల్ తెలిపారు. వారికి ప్రథమ చికిత్స చేసిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రాణాపాయం నుంచి అందరూ బయటపడినట్లు కౌశల్ వెల్లడించారు.