Hindus should adopt Muslim formula, marry girls at 18-20 years says AIDUF chief Badruddin Ajmal: హిందువులు తమ పిల్లల పెళ్లిళ్లలో ముస్లిం ఫార్మాలాను పాటించాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్. హిందువులు తమ పిల్లలకు త్వరగా పెళ్లి చేయాలని సూచించారు. చట్టం అనుమతించిన దాని ప్రకారం ముస్లిం యువకులు 20-22 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటారని..ముస్లిం మహిళలు 18 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటారని అన్నారు. అయితే హిందువులు మాత్రం పెళ్లికి ముందు ఇద్దరు, ముగ్గురితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని, 40 ఏళ్ల వయసులు తల్లిదండ్రుల ఒత్తడితో పెళ్లి చేసుకుంటారని అన్నారు.
Read Also: Shraddha Case: ముందుగా చేతులు.. ఆ తర్వాత ఒక్కొక్కటిగా.. అఫ్తాబ్ నార్కోటెస్టులో భయంకర విషయాలు
ముస్లిం జనాభా పెరుగుదలపై మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ అస్సాం రాజకీయనాయకుడు. హిందువులు పిల్లల్ని కనకుండా ఎంజాయ్ చేస్తూ డబ్బును ఆదా చేస్తారంటూ వ్యాఖ్యానించారు. మీరు సారవంతమైన భూమిలోనే విత్తనాలు వేస్తే పంటలు బాగా వస్తాయని పరోక్షంగా పెళ్లి వయసును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హిందువులు కూడా ముస్లింఫార్ములాను అనుసరించి త్వరగా పెళ్లి చేసుకోవాలని అన్నారు. అబ్బాయిలు 20-22, అమ్మాయిలు 18 ఏళ్లలో పెళ్లి చేసుకోవాలని, అప్పుడు చూడండి ఎంతమంది పిల్లలు పుడుతారో అంటూ కామెంట్స్ చేశారు.
శ్రద్ధావాకర్ హత్యకేసులో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన ‘‘లవ్ జిహాద్’’ వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ఈ రోజు దేశంలో పెద్ద నేతల్లో హిమంతబిశ్వ శర్మ ఒకరని.. ఆయనను ఎవరు ఆపుతున్నారంటూ.. మీరు కూడా లవ్ జీహాద్ చేసి ముస్లిం అమ్మాయిలను ఎత్తుకెళ్లండి.. మేము దీన్ని స్వాగతిస్తాం, నిరసన తెలియజేయం అని అజ్మల్ అన్నారు. ఇటీవల పలు సందర్భాల్లో హిమంత బిశ్వ శర్మ, శ్రద్ధా వాకర్ హత్యను ‘‘లవ్ జీహాద్’’గా అభివర్ణించాడు. దీనిపై చట్టం తీసుకురావాలని కోరాడు. ముస్లిం యువకులు లవ్ జీహాద్ పేరుతో అమాయకమైన హిందూ యువతులను బలవంతంగా మతం మారుస్తున్నారంటూ కామెంట్స్ చేశారు.