Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budameru Floods: తీవ్ర వాయుగుండం తీరం దాటింది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది.. అయితే, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వద్ద బుడమేరులో వరద ఉధృతి పెరిగింది.. బుడమేరులో భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో బుడమేరు వరదల సమయంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కొండపల్లి కవులూరు బ్రిడ్జి వద్ద బుడమేరు నిండుకుండలా ప్రవహిస్తోంది.
పైనుంచి వస్తున్న వరద నీటితో బుడమేరులో ప్రవాహం పెరిగినప్పటికీ ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని ఇరిగేషన్ ఏఈ వెంకటేష్ తెలిపారు. వరద పరిస్థితిని అధికారులు గంట గంటకూ పర్యవేక్షిస్తున్నారు. పైనుంచి వచ్చే వరద నీటిని చెరువులకు మళ్లించేలా చర్యలు చేపట్టారు. మరోవైపు పట్టిసీమ నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కవులూరు బ్రిడ్జి వద్ద గతంలో గండ్లు పడిన ప్రాంతంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ప్రస్తుతం ధృఢంగా నిలిచింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
Also Read
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
పైనుంచి వస్తున్న వరద నీటి కారణంగా బుడమేరుకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వరద ప్రవాహం కృష్ణా నదిలోని పాయల మధ్యగా కొనసాగుతోంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కాగా, గతంలో బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలోని చాలా ప్రాంతాలు నీటమునిగిన విషయం విదితమే.. బుడమేరు దెబ్బకు భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి రాగా.. ఇప్పుడు, ముందే అప్రమత్తం అయ్యారు అధికారులు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!