AIADMK-BJP: వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళని స్వామి, కేంద్ర హోం మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు నేతలు కూడా గంటల తరబడి చర్చించారు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ-అన్నాడీఎంకేల పొత్తు తెర పైకి వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
AIADMK Leadership row: తమిళనాడు రాజకీయ పార్టీ ఏఐడీఎంకే పార్టీ చీఫ్ గా పళనిస్వామి ఉంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఉంటారని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే పార్టీపై తన అధిపత్యాన్ని నిలుపుకోవడానికి పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఏఐఏడీఎంకే నేత ఇ.పళనిస్వామికి మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియామకం చెల్లదని హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. పళనిస్వామితో తీవ్ర అధికార పోరులో చిక్కుకున్న ఓ పన్నీర్‌సెల్వంకు ఈ తీర్పు తీపికబురుగా మారింది. పార్టీ నాయకత్వం విషయంలో జూన్ 23కి ముందు ఉన్న స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది.
O Panneerselvam Joining BJP: తమిళనాడు రాజకీయాలు కీలక చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల అన్నాడీఎంకే పార్టీలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. పార్టీపై పట్టు సాధించే ప్రయత్నంలో ఇరు వర్గాలు పోటాపోటీగా కోర్టు కేసులు పెట్టుకున్నాయి.