September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- సెప్టెంబర్ జీతం, పెన్షన్‌పై కీలక నిర్ణయం
- 25వ తేదీనే ఖాతాల్లోకి డబ్బులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Government Employees Salary Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతం, పెన్షన్ విషయంలో కీలక నిర్ణయం వెలువడింది. సాధారణంగా నెలాఖరులో జమ అయ్యే సెప్టెంబర్ నెల జీతం, పెన్షన్ ఈసారి ముందుగానే అందే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ప్రతిపాదించిన మూడు రోజుల బ్యాంకు సమ్మెను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 25నే జీతం, పెన్షన్
సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లను సెప్టెంబర్ 25, శుక్రవారం చెల్లించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో ఈ ముందస్తు చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) సెప్టెంబర్ 23న జారీ చేసిన ఆఫీస్ మెమొరాండం ప్రకారం ఈ ముందస్తు చెల్లింపులకు అనుమతి ఇచ్చారు.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
ఎవరెవరికి ప్రయోజనం?
సెప్టెంబర్ నెల జీతాన్ని ముందుగా పొందే అవకాశం ఉన్నవారిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ ఉద్యోగులు, పోస్టల్ శాఖ ఉద్యోగులు, టెలికమ్యూనికేషన్ శాఖ ఉద్యోగులు, పారిశ్రామిక ఉద్యోగులు. అలాగే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన సెప్టెంబర్ 2026 పెన్షన్‌ను కూడా సెప్టెంబర్ 25న ముందుగా చెల్లించే అవకాశం ఉంది. బ్యాంకులు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసుల (PAO) ద్వారా ఈ చెల్లింపులు జరగనున్నాయి.
బ్యాంకు సమ్మె కారణంగానే ముందస్తు చెల్లింపులు
సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె ప్రతిపాదించారు. ఈ తేదీలు సెప్టెంబర్ నెలాఖరుతో పాటు ప్రస్తుత త్రైమాసికం ముగింపు రోజులకు కూడా సమీపంగా ఉన్నాయి. బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడితే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ చెల్లింపుల్లో జాప్యం జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. అందుకే నెలాఖరులో జరగాల్సిన కొన్ని చెల్లింపులను సాధ్యమైనంత వరకు ముందుగానే పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు సూచనలు ఇచ్చారు.
అక్టోబర్ జీతంలో సర్దుబాటు
సెప్టెంబర్ 25న చెల్లించే జీతం, పెన్షన్‌ను అడ్వాన్స్ పేమెంట్‌గా పరిగణించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన వాస్తవ చెల్లించాల్సిన మొత్తంలో ఏదైనా తేడా ఉంటే, దాన్ని అక్టోబర్ 2026 జీతం లేదా చెల్లింపుల్లో సర్దుబాటు చేయనున్నారు. అంటే ముందుగా జీతం రావడం వల్ల ఉద్యోగులు లేదా పెన్షనర్లకు అదనపు మొత్తంగా పరిగణించరు. తుది లెక్కల ప్రకారం అవసరమైన సర్దుబాట్లు తర్వాతి చెల్లింపుల్లో జరుగుతాయి.
ఆర్బీఐకి కూడా సమాచారం
ముందస్తు చెల్లింపులకు సంబంధించిన ఆదేశాలను సంబంధిత బ్యాంకుల పేమెంట్ బ్రాంచ్‌లకు చేరవేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ని కూడా CGA కోరింది. బ్యాంకు సమ్మె కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సాధారణ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేదా జాప్యం లేకుండా చూడటమే ఈ చర్య ప్రధాన ఉద్దేశం. మొత్తంగా, సెప్టెంబర్ 2026లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సాధారణ తేదీ కంటే ముందుగానే అంటే సెప్టెంబర్ 25న జీతం, పెన్షన్ అందే అవకాశం ఉంది.
Ministry of Finance has decided that the salary/wages and pension for September 2026 may be disbursed on 25 September 2026 (Friday) in view of the proposed three-day nationwide bank strike from 28–30 September 2026.
The measure covers Central Government employees and pensioners,… pic.twitter.com/yhxfKBVvdn
— Central Secretariat Service Forum (@CSSforum_) September 23, 2026
తాజావార్తలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!