Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
- మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన
- గవర్నర్, సీఎంతో భేటీ!
- చారిత్రక కాంగ్లా కోట సందర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ మణిపూర్‌లో పర్యటించారు. శుక్రవారం ఇంఫాల్‌లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
చారిత్రక కాంగ్లా కోట సందర్శన
అంతకుముందు సెర్జియో గోర్ మణిపూర్‌లోని చారిత్రక కాంగ్లా కోటను సందర్శించారు. ఒకప్పుడు మణిపూర్ రాజ్యానికి రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా ఉన్న ఈ కోటకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. అలాగే మహిళలు నిర్వహించే ప్రముఖ మార్కెట్ ‘ఖ్వైరంబండ్ ఈమా కైథెల్’ను కూడా సందర్శించారు. మణిపూర్ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే క్రమంలో ఈ ప్రాంతాలను గోర్ సందర్శించినట్లు తెలుస్తోంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్లోనే అమెరికా రాయబారి రాత్రి బస చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Also Read
అంతకుముందు డార్జిలింగ్‌లో పర్యటన
మణిపూర్ పర్యటనకు ఒక రోజు ముందు సెర్జియో గోర్ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో పర్యటించారు. రాజ్యసభ ఎంపీ, మాజీ విదేశాంగ కార్యదర్శి, అమెరికాలో భారత మాజీ రాయబారి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా వ్యక్తిగత ఆహ్వానం మేరకు డార్జిలింగ్ వెళ్లారు. డార్జిలింగ్ పర్యటనపై సెర్జియో గోర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. భారత్‌కు వచ్చిన తొలినాళ్లలో తనను ఆప్యాయంగా స్వాగతించిన వారిలో హర్ష్ వర్ధన్ శ్రింగ్లా ఒకరని తెలిపారు. తన స్వస్థలం, నియోజకవర్గమైన డార్జిలింగ్‌ను సందర్శించాలని శ్రింగ్లా ఆహ్వానించారని, ఆ అవకాశం ఇప్పుడు లభించిందని చెప్పారు. డార్జిలింగ్ ప్రజల ఆతిథ్యం, అక్కడి చరిత్ర, ప్రకృతి అందాలు, ఆహారం తనను ఆకట్టుకున్నాయని గోర్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరోసారి డార్జిలింగ్‌కు వస్తానని తెలిపారు.
మకైబారి టీ ఎస్టేట్‌లో ప్రత్యేక అనుభవం
డార్జిలింగ్‌లోని ప్రసిద్ధ టీ తోటల్లో ఒకటైన చారిత్రక మకైబారి టీ ఎస్టేట్‌ను కూడా సెర్జియో గోర్ సందర్శించారు. అక్కడి పచ్చని తేయాకు తోటలను వీక్షిస్తూ, ప్రపంచ ప్రసిద్ధ డార్జిలింగ్ టీని ఆస్వాదించారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే తన పర్యటనలో భాగంగానే డార్జిలింగ్, మణిపూర్‌లను గోర్ సందర్శించినట్లు తెలుస్తోంది.


తాజావార్తలు
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?