Survey Predicts: లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. వెలుగులోకి షాకింగ్ సర్వే
- లోక్‌సభ ఎన్నికలపై వెలుగులోకి సంచలన సర్వేలు
- బీజేపీ, కాంగ్రెస్‌కు ఎన్నెన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన సర్వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడింది. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇండియా కూటమి కూడా బాగానే బలం పుంజుకుంది. కాంగ్రెస్‌కు కూడా ఆశించిన స్థాయిలోనే సీట్లొచ్చాయి. ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Cloudburst: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. 2 జిల్లాల్లో పలువురు జలసమాధి!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
తాజాగా సరికొత్త సర్వే వెలుగులోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఎన్డీఏ కూటమికి 300లకు పైగా సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. ఇక ఇండియా కూటమికి 208 సీట్లు వస్తాయని తెలిపింది. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 240 సీట్లే వచ్చాయి. 272 మెజారిటీ మార్కు దాటలేకపోయింది. 2019లో మాత్రం సొంతంగా 303 సీట్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ప్రస్తుతం మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు జరిగితే మాత్రం బీజేపీకి సొంతంగా 260 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది.
ఇది కూడా చదవండి: Poland: ఎయిర్ షోలో అపశృతి.. కూలిన జెట్ విమానం.. ఫైలట్ మృతి
ఇక గతేడాది 234 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈసారి 208 సీట్లకే పరిమితం అవుతుందని తెలిపింది. జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య ఈ సర్వే నిర్వహించినట్లు చెప్పింది. ఈ సర్వేలో 2,06,826 మంది అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి చాలా ఎదురుదెబ్బలు తగిలాయి.
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే..
అలాగే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 260 సీట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తెలిపింది. సొంతంగానే బీజేపీ మెజారిటీ సాధించగలదని చెప్పింది. ఇదే సంస్థ ఫిబ్రవరిలో చేపట్టినప్పుడు బీజేపీకి 281 సీట్లు వస్తాయని పేర్కొంది. తాజా సర్వేలో తగ్గుదల చూపించింది. ఫిబ్రవరి సర్వేలో ఎన్డీఏ కూటమికి 343 సీట్లు వస్తాయని.. ప్రస్తుత సర్వేలో మాత్రం 324 సీట్లే వస్తాయని వెల్లడించింది. ఇక కాంగ్రెస్ 97 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 2024లో గెలిచిన 99 సీట్లకు దాదాపు సమానంగా ఉంటుందని చెప్పింది. ఫిబ్రవరిలో మాత్రం 78 సీట్లే గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఓట్ల చోరీ యాత్ర తర్వాత కాంగ్రెస్ ప్రస్తుతం పుంజుకుందని వెల్లడించింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..