ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా అధికార పార్టీకి చాలా కీలకం. అదే తరుణంలో శివసేన (యూబీటీ)కి కూడా అంతే ప్రాధాన్యం. ఇప్పటికే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో భారీ విజయం నమోదు కావడంతో కూటమి ప్రభుత్వం మంచి జోష్‌లో ఉంది. ముంబైను కూడా సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇది కూడా చదవండి: CJI Suryakant: ఢిల్లీ కాలుష్యాన్ని వారు పరిష్కరించగలరు.. జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్య
ఇక స్థానిక ఎన్నికల్లో పరాజయంతో విపక్షాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా ముంబైలో కీలకమైన శివసేన (యూబీటీ) కూడా అలర్ట్ అయింది. ముంబై మేయర్ పదవిని సొంతం చేసుకోవాలని ప్రణాళిక రచిచూస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల థాక్రే బ్రదర్స్ ఏకమయ్యారు. కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Silver Rates: బాబోయ్ సిల్వర్.. మరోసారి భారీగా పెరిగిన వెండి ధర
ఇదిలా ఉంటే తాజాగా ముంబై మున్సిపల్ ఎన్నికలపై సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది. ముంబైలో ఎక్కువగా మరాఠీ మాట్లాడే వారే ఎక్కువగా ఉంటారు. దీంతో ముంబైలోని మరాఠీ మాట్లాడే ఓటర్లంతా ఉద్ధవ్ వర్గాన్ని నిజమైన శివసేనగా భావిస్తున్నట్లు తేలింది. ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే, రాజ్ థాక్రేకు చెందిన మూడు వర్గాలు ఏకం కావాలని కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది. ఇక ఇందులో రెండింతల ఓటర్లు మాత్రం ఉద్ధవ్ థాక్రే వర్గం వైపే ఉన్నట్లుగా గురువారం వెల్లడైన కొత్త సర్వేలో తేటతెల్లం అయింది. డిసెంబర్ 17- 24 మధ్య అసెండియా స్ట్రాటజీస్ నగరవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. 52 శాతం మంది ఉద్ధవ్ థాక్రే వైపు ఉన్నట్లు తేలింది. నిజమైన శివసేన ఎవరిని నమ్ముతున్నారని అడిగితే మాత్రం 45 శాతం మంది శివసేన (యూబీటీ)గా వెల్లడైంది. ఏక్‌నాథ్ షిండేకు 22 శాతం, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)కి కేవలం 1 శాతం మద్దతు మాత్రమే లభించింది. మొత్తంగా 24 శాతం మంది ఉన్నట్లు తేలింది. దీంతో షిండే వర్గంలో అలజడి రేపింది.
ముంబై మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జనవరి 16న విడుదల కానున్నాయి. ఇక థాక్రే సోదరులు ఏకం కావడంతో కాంగ్రెస్ దూరం అయింది. ఒంటరిగానే బరిలోకి దిగనుంది. ఇక శరద్ పవార్ పార్టీ మాత్రం పొత్తుపై నిర్ణయం ప్రకటించలేదు. మరీ ఆర్థిక రాజధాని ఎవరి సొంతం కాబోతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.