ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా అధికార పార్టీకి చాలా కీలకం. అదే తరుణంలో శివసేన (యూబీటీ)కి కూడా అంతే ప్రాధాన్యం. ఇప్పటికే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో భారీ విజయ నమోదు కావడంతో కూటమి ప్రభుత్వం మంచి జోష్‌లో ఉంది. ముంబైను కూడా సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.
ముంబై మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇక ఇటీవల జరిగిన మహారాష్ట్రలోని స్థానిక ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. సరైన ఫలితాలు రాబట్టలేక చతికిలబడింది.
ఇటీవల జరిగిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో శివసేన (యూబీటీ) ఘోరంగా దెబ్బతింది. దీంతో ఆ పార్టీ అప్రమత్తం అయింది. జనవరిలో జరిగే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో అయినా తమ సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో థాక్రే బ్రదర్స్ ఒక్కటయ్యారు.