Seema Haider: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం ఈ నెల 22న ప్రారంభం కాబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖులు కూడా వస్తున్నారు. వీరితో పాటు లక్షలాది మందితో అయోధ్య నగరం నిండిపోనుంది. రామభక్తులు ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్య నగరంలో పండగ వాతావరణం నెలకొంది.
Read Also: Nipah vaccine: ప్రపంచంలోనే తొలి “నిపా వైరస్” వ్యాక్సిన్.. మానవ పరీక్షలు ప్రారంభం..
ఇదిలా ఉంటే.. తాను శ్రీరాముడిని దర్శించుకునేందుకు కాలినడకన అయోధ్యకు వెళ్తానని చెప్పారు పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ.. రామ మందిరానికి ఎవరు వెళ్లేందుకు ఇష్టపడరు..? ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే తప్పకుండా వెళ్తానని చెప్పారు. మా కుటుంబం చెప్పులు లేకుండా కాలినడకన అయోధ్యకు వెళ్తామని, ఆ రోజు త్వరగా రావాలని ఆమె ప్రార్థించారు. సీమా హైదర్ చేసిన ప్రకటన ఇప్పుడు వైరల్‌గా మారింది. రామ మందిరానికి వెళ్లాలని కొందరు సీమా హైదర్ ప్రకటనతో ఏకీభవించగా.. మరికొందరు వెళ్లకపోవడమే మంచిదని అంటున్నారు.
గతేడాది సీమా హైదర్ అనే పాకిస్తాన్ యువతి ప్రేమించిన యువకుడి కోసం భారత్ రావడం వార్తల్లో నిలిచింది. అతడిని పెళ్లి చేసుకునేందుకు హిందూ మతాన్ని స్వీకరించింది. పబ్జీ గేమ్ నోయిడాకు చెందిన సచిన్‌తో సీమా హైదర్ ప్రేమలో పడేలా చేసింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్, తన పిల్లలతో సహా నేపాల్ మీదుగా ఇండియాకు వచ్చింది.