బీహార్‌లో ప్రస్తుతం సీట్ల పంపకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తైంది. ఇప్పుడు ఇండియా కూటమి వంతు వచ్చింది. ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు పూర్తైనట్లు తెలుస్తోంది. అధికారమే లక్ష్యంగా ఆర్జేడీ తీవ్ర కసరత్తు చేసినట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump: మోడీ మంచి స్నేహితుడు.. గాజా శాంతి సదస్సులో ట్రంప్ ప్రశంసలు
తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 135 స్థానాల్లో.. కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేయవచ్చని వర్గాలు తెలిపాయి. 144 సీట్ల కోసం ప్రయత్నించిన ఆర్జేడీ.. ఇప్పుడు 135 సీట్లలో సర్దుకున్నట్లు సమాచారం. ఇక 70 సీట్లపై దృష్టి పెట్టిన మిత్రపక్షమైన కాంగ్రెస్.. 61 సీట్లలో పోటీ చేయొచ్చని వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Crime News: బాలానగర్లో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్న తల్లి
బీహార్‌లో ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే సమయం తక్కువగా ఉంది. కానీ సీట్ల పంపకాలపై కొన్ని వారాలుగా ప్రతిపక్ష కూటమి తర్జనభర్జన పడుతోంది. ఇండియా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సహా జేఎంఎం, సీపీఐ, సీపీఎం, మరికొన్ని పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నింటికీ సీట్ల సర్దుబాటుపై కూటమి తలలు పట్టుకుంటోంది. వెనుకబడిన కులాల ఓట్లను కలిగి ఉన్న ముఖేష్ సాహ్ని పార్టీ 50 సీట్లు, ఉప ముఖ్యమంత్రి పదవిని కోరింది. అన్ని పార్టీలకు సీట్లు ఎలా పంచాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. సమయం తక్కువుగా ఉండడంగా మంగళవారం కీలక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.
ఎన్డీఏ..
బీజేపీ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌ల ఎన్డీయే కూటమి సీట్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాలో పోటీ చేయనున్నాయి. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 29 సీట్లు దక్కాయి. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తాయి. 2020 బీహార్ ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేయగా.. బీజేపీ 110 సీట్లలో పోటీ చేసింది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న విడుదల కానున్నాయి.