Supreme Court: ప్రధాని మంత్రి నరేంద్రమోడీ పాలన, బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తూ ‘‘రెచ్చగొట్టే’’ కార్టూన్‌ను వేసిన కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్టూన్‌ను శివుడి వ్యాఖ్యలతో లింక్ చేయడాన్ని తప్పుపట్టింది. ఇండోర్‌కు చెందిన 50 ఏళ్ల కార్టూనిస్ట్ ‘‘అపరిపక్వత’’ పట్ల జస్టిస్ సుధాన్షు ధులియా నేతృత్వంలోని ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతను వాక్, భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని పేర్కొంది. కార్టూన్‌ను తొలగించాలని కోర్టు కోరింది.
Read Also: Lokesh Kanagaraj : రజినీకాంత్ కు చెప్పిన కథ వేరు.. తీసింది వేరు : లోకేష్
ఈ కేసులో మాల్వియా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మంగళవారం విచారణకు వాయిదా వేసింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కోసం చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. 24 గంటల వ్యవధిలో ఏమీ జరగదని మాల్వియ తరపున హాజరైన న్యాయవాది వృందా గ్రోవర్‌కు కోర్టు తెలిపింది. మాల్వియా కార్టూన్‌ను మాత్రమే పోస్ట్ చేశారని, సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలను మరొక వ్యక్తి జోడించినట్లు అతడి తరపునను న్యాయవాది కోర్టుకు తెలిపారు. మాల్వియా క్షమాపణ చెప్పందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్టూన్ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తోందని, శాంతి భద్రతల విచ్ఛిన్నానికి కారణమవుతోందని రాష్ట్రం తరుపున వాదించిన సోలిసిటర్ జనరల్ నటరాజ్ కోర్టుకు చెప్పారు.