భారత కుబేరులు అనగానే టక్కున అంబానీ, అదానీ పేర్లు చెప్పేస్తారు. దేశ సంపన్నుల జాబితాలో అంబానీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత అదానీ. మొత్తం సంపాదనలో వారు టాప్‌లో ఉండగా.. ఈ ఏడాది మాత్రం వారిని వెనక్కి నెట్టారు సావిత్ర జిందాల్. ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ నివేదిక ప్రకారం.. 2023 ఏడాదిలో అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో 73 ఏళ్ల మహిళ సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం సంపద రూ.2.1 లక్షల కోట్లతో దేశ సంపన్నుల జాబితాలో ఆమె 5వ స్థానంలో ఉన్నారు.
Also Read: Ramcharan -Upasana : క్లింకారతో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్-ఉపాసన..
ఆ అయితే ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద రూ.80 వేలకోట్లు పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. దాంతో అంబానీ, అదానీ, బిర్లా.. వంటి ప్రముఖుల సంపదను సావిత్రి జిందాల్ మించిపోయారు. జిందాల్ గ్రూప్‌ను స్థాపించిన ఓం ప్రకాశ్ జిందాల్ సతీమణే సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం ఆమె ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్‌గా భాద్యతలు చేపట్టారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్‌లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో లాభాల్లో దూసుకెళ్లడంతో ఈ ఏడాదికి సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది.
Also Read: NZ vs BAN: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్ బ్యాటర్.. దిగ్గజాల వల్ల కూడా కాలే!
దేశీయ కుబేరుల జాబితాలో అయిదో స్థానంలో నిలిచినా.. దేశంలోని మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం. మొత్తం సంపద విషయంలో అజీమ్ ప్రేమ్‌జీ (రూ.2 లక్షల కోట్లు)ను సావిత్రి దాటేశారు. ఇక ఈ ఏడాది ఎక్కువ సంపద అర్జించిన వారిలో సావిత్రి జిందాల్‌ది అగ్రస్థానం కాగా ఆ తర్వాత స్థానంంలో హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్‌నాడార్ రూ.66వేల కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అయితే మొత్తంగా మాత్రం రూ.7.7 లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ అత్యధిక సంపన్నుడిగానే కొనసాగుతున్నారు. ప్రపంచ కుబేరుల్లో అంబానీ 13వ స్థానంలో నిలిచారు. అయితే ఈ ఏడాది ఆయన సంపద రూ.43 వేలకోట్లు పెరిగినట్లు తెలిసింది. రూ.7 లక్షల కోట్ల సంపదతో దేశంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు.