Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు కీలక పదవి కట్టబెట్టిన తెలంగాణ ప్రభుత్వం
- టిఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు
- ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న దిల్ రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన కెరీర్ మొదట డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ఎన్నో మంచి సినిమాలను నిర్మించి సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు. స్టార్ హీరో సినిమాల దగ్గర నుండి చిన్న సినిమాల వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్ర నిర్మాతకు తెలంగాణ సర్కార్ కీలక పదవి కల్పించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
టాలీవుడ్‌లో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ కొత్త వారికి కూడా ఛాన్సులు కల్పిస్తారనే విషయం తెలిసిందే. ఇండిస్ట్రీలోకి కొత్తగా వస్తున్న వారిని ప్రొత్సహిస్తూ ఆయన పలు కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభంచారు. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు తాను ‘దిల్ రాజు డ్రీమ్స్’ పేరుతో కొత్త బ్యానర్ క్రియేట్ చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కోసం ఆయన ఒక వెబ్‌సైట్‌ను కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) ప్రెసిడెంట్ గా గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆ ఎన్నికల ద్వారా 2023-25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భవిష్యత్ తరాలకు మంచి ఇండస్ట్రీని అందించాలనే నినాదంతో దిల్‌రాజు ప్యానెల్ ఆ సమయంలో బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!