Syria: సిరియాలో దశాబ్ధాల అస్సాద్ పాలనకు తిరుగుబాటుదారులు తెరదించారు. సిరియాని స్వాధీనం చేసుకున్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ తన కుటుంబంతో రష్యా పారిపోయాడు. హయత్ తహ్రీర్ అల్ షామ్(హెచ్‌టీఎస్) నాయకుడు అబు అహ్మద్ అల్ జోలానీ నేతృత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది. దశాబ్ధాలుగా సాగిన అస్సాద్ వంశ పాలనలో అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ‘‘సైద్నాయ జైలు’’ నియంతృత్వ పాలనకు సాక్ష్యంగా మారింది.
రాజధాని డమాస్కస్‌కి ఉత్తరాన ఉన్న సైద్నాయ జైలు అస్సాద్ వంశం అమానవీయ దురాగతాలకు చిహ్నంగా ఉంది. ప్రభుత్వానికి ఎదురుతిరిగిన వారి అదృశ్యం, దారుణమై శిక్షలు, హత్యలు, అత్యాచారాలకు ఈ జైలు ఇప్పుడు సమాధానంగా మారింది. ముఖ్యంగా 2011లో అంతర్యుద్ధం నుంచి ఈ జైలులో అనేక క్రూరమైన నేరాలు జరిగాయి. అసద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత సిరియన్ తిరుగుబాటుదారులు ఈ జైలు నుంచి ఖైదీలను విడిపించారు. ఇందులో కొందరు ఏకంగా 1980 నుంచి నిర్భంధించబడిన వారు ఉన్నారు.
అసోసియేషన్ ఆఫ్ డిటైనీస్ అండ్ మిస్సింగ్ పర్సన్స్ ఆఫ్ సైద్నాయ జైలు (ADMSP) ప్రకారం, తిరుగుబాటుదారులు 4,000 మందికి పైగా విముక్తి పొందారు. ఈ జైలుని బషర్ అల్ అస్సాద్ తండ్రి హఫీజ్ అల్ అస్సాద్ పాలనలో నిర్మించారరు. మొదట్లో ఇస్లామిస్ట్ గ్రూపులు, కుర్దిష్ కార్యకర్తలతో సహా రాజకీయ ఖైదీల కోసం జైలుని నిర్మించారు. కానీ కొన్నేళ్లకే సొంత ప్రజలుపై అకృత్యాలకు కేంద్రంగా మారింది.
Read Also: Raaja Saab : ‘రాజా సాబ్’ చెప్పిన టైమ్ కే వస్తాడా..?
2016లో ఐక్యరాజ్యసమితి కమీషన్ “సైద్నాయలో హత్య, అత్యాచారం లేదా ఇతర రకాల లైంగిక హింస, హింస, జైలు శిక్ష, బలవంతంగా అదృశ్యం , ఇతర అమానవీయ చర్యల వంటి మానవత్వానికి వ్యతిరేకంగా సిరియన్ ప్రభుత్వం నేరాలకు పాల్పడింది” అని కనుగొంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ “హ్యూమన్ స్లాటర్‌హౌస్”తో దీనిని అభివర్ణించింది.
ఈ జైలులో శ్మశానవాటికలో హత్యకు గురైన అనేక మంది ఖైదీల అవశేషాల కాల్చబడ్డాయి. సైద్నాయలో ఉప్పుతో గదులు ఉన్నాయి. 2011 మరియు 2018 మధ్యకాలంలో 30,000 కంటే ఎక్కువ మంది ఖైదీలు ఉరితీయబడ్డారు, చిత్రహింసల వల్ల మరణించారు. మృతదేహాలను భద్రపరిచేందుకు కోల్డ్ స్టోరేజీల కొరతను తీర్చడానికి ఈ ఉప్పుగదుల్ని ఏర్పాటు చేశారు. 2022లో సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ సైద్నాయలో దాదాపు 30,000 మందిని ఖైదు చేయబడ్డారని, అక్కడ చాలా మంది హింసించబడ్డారని మరియు కేవలం 6,000 మంది మాత్రమే విడుదలయ్యారని నివేదించింది.
విదేశీ ఖైదీలను కూడా ఇక్కడే బంధించినట్లు తెలిసింది. జోర్డాన్‌కి చెందిన ఒసామా బషీర్ హసన్ అల్ బటైనాతో సహా అనేక మంది విదేశీయులు కూడా సిరియన్ జైళ్లలో మగ్గిపోయారు. ఇతను 38 ఏళ్లు జైలులో గడిపాడు. ప్రస్తుతం స్పృహ కోల్పోయి, జ్ఞాపకశక్తి లేకుండా గుర్తించబడ్డాడు. జోర్డాన్‌లోని అరబ్ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం, 236 మంది జోర్డాన్ పౌరులు సిరియన్ జైళ్లలో ఉన్నారు, వారిలో ఎక్కువ మంది సైద్నాయలో ఉన్నారు.