NTV Telugu Site icon

Salman Khurshid: భారత్‌లో బంగ్లాదేశ్ తరహా అల్లర్లు జరిగే ఛాన్స్..?

Salman

Salman

Salman Khurshid: కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ హాట్ కామెంట్స్ చేశారు. భారత్‌లోనూ బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్‌లో సాధారణ పరిస్థితులు కనబడుతున్నప్పటికి.. అక్కడి మాదిరిగానే హింసాత్మక పరిస్థితులు భారత్ లో కూడా నెలకొనే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కశ్మీర్‌లో ప్రతిధీ సాధారణంగానే కనబడుతుంది.. కానీ వాస్తవం ఎక్కడుందో గ్రహించాలి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు.

Read Also: Anna Canteens: ముస్తాబవుతున్న అన్న క్యాంటిన్లు..ప్రారంభ తేదీ ప్రకటించిన పురపాలక శాఖ

కాగా, ఆగ్నేయ ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో మహిళలు నాయకత్వం వహించి దాదాపు 100 రోజుల పాటు సీఏఏ, ఎన్నార్సీలపై చేసిన నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని రోజుల్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఆ నిరసనల్లో పాల్గొన్న చాలా మంది మహిళలు ఇప్పటికీ జైళ్లలో ఉన్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఎంత మందికి ఈ దేశ శత్రువులుగా ముద్ర పడిందో ఊహించలేకపోతున్నాం.. కాగా, బంగ్లాదేశ్ లో సంక్షోభ పరిస్థితుల వేళ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Show comments